బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం.. ఒకరు మృతి
దిశ, దేవరకొండ: విశాఖపట్టణం జిల్లా చింతపల్లిలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం మూలంగా ఒకరు మృతిచెందారు. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… నాగార్జునసాగర్‌కు చెందిన రాహుల్ యాదవ్(36), ఆయన కూతురు హేమశ్రీ(6)తో పాటు ఆమె స్నేహితులు లక్ష్మణ్, సౌమిత్రి, కుమార్‌లతో ఆదివారం రాత్రి విశాఖ నుంచి హైదరాబాద్‌కు కారులో బయలుదేరారు. అయితే ఇదే సమయంలో హైదరాబాద్ నుంచి మర్కాపూర్ వెళుతున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు చింతపల్లి మండలం వింజమూరు గేట్ […]
దిశ, దేవరకొండ: విశాఖపట్టణం జిల్లా చింతపల్లిలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం మూలంగా ఒకరు మృతిచెందారు. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… నాగార్జునసాగర్‌కు చెందిన రాహుల్ యాదవ్(36), ఆయన కూతురు హేమశ్రీ(6)తో పాటు ఆమె స్నేహితులు లక్ష్మణ్, సౌమిత్రి, కుమార్‌లతో ఆదివారం రాత్రి విశాఖ నుంచి హైదరాబాద్‌కు కారులో బయలుదేరారు. అయితే ఇదే సమయంలో హైదరాబాద్ నుంచి మర్కాపూర్ వెళుతున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు చింతపల్లి మండలం వింజమూరు గేట్ వద్దకు రాగానే వేగంగా వచ్చి, ఎదురుగా వస్తున్న వారి కారును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారు డ్రైవింగ్ చేస్తున్న రాహుల్ యాదవ్, హేమశ్రీకి తీవ్రగాయాలు కాగా, మిగతా వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వారిని వెంటనే హైదరాబాద్ కామినేని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ… హేమశ్రీ మృతిచెందింది. అయితే ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు, పోలీసులు నిర్ధారించారు. హేమశ్రీ తాత మధుసూదన్ ఫిర్యాదు మేరకు బస్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక ఎస్ఐ తెలిపారు.