ఒక్క ఆర్డర్‌కు 42 పార్సిల్స్ ఎందుకొచ్చాయి..?

దిశ, వెబ్‌డెస్క్ : ఈ రోజుల్లో ‘ఫుడ్ యాప్స్’లో నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేయడం కామన్. అయితే, ఎప్పుడైనా మీరు ఆర్డర్ చేసినా దానికన్నా ఎక్కువ ఫుడ్ పొందారా? డబ్బులు పే చేయకముందే ఆర్డర్ ఓకే అయ్యిందా? అంటే రెగ్యులర్‌గా జరగకపోవచ్చు గానీ సిస్టమ్, ఇంటర్నెట్, యాప్ ప్రాబ్లెమ్స్ వల్ల ఎప్పుడైనా ఓ సారి జరుగుతుంటాయి. ముఖ్యంగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల డెలివరీ బాయ్, కస్టమర్, టేక్ అవే ఓనర్.. కన్ఫ్యూజన్ ఎదుర్కొంటారు. ఇప్పుడు ఫిలిప్పీన్స్‌‌లోనూ అదే […]

Update: 2020-12-20 23:00 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఈ రోజుల్లో ‘ఫుడ్ యాప్స్’లో నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేయడం కామన్. అయితే, ఎప్పుడైనా మీరు ఆర్డర్ చేసినా దానికన్నా ఎక్కువ ఫుడ్ పొందారా? డబ్బులు పే చేయకముందే ఆర్డర్ ఓకే అయ్యిందా? అంటే రెగ్యులర్‌గా జరగకపోవచ్చు గానీ సిస్టమ్, ఇంటర్నెట్, యాప్ ప్రాబ్లెమ్స్ వల్ల ఎప్పుడైనా ఓ సారి జరుగుతుంటాయి. ముఖ్యంగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల డెలివరీ బాయ్, కస్టమర్, టేక్ అవే ఓనర్.. కన్ఫ్యూజన్ ఎదుర్కొంటారు. ఇప్పుడు ఫిలిప్పీన్స్‌‌లోనూ అదే జరిగింది. ఓ ఏడేళ్ల అమ్మాయి తను ఎప్పుడూ ఫుడ్ ఆర్డర్ చేసినట్లే ఆ రోజు కూడా చేసింది. కానీ అనూహ్యంగా 42 మంది డెలివరీ బాయ్స్ పార్సిల్స్‌తో తన ఇంటికి వచ్చారు? అసలు ఏం జరిగింది? ఆ చిన్నారి ఫుడ్ ఆర్డర్ పెట్టడంతో మిస్టేక్ చేసిందా?

ఫిలిప్పీన్స్‌లోని సెబూ సిటీకి చెందిన ఓ ఏడేళ్ల అమ్మాయి సింపుల్ లంచ్ ఆర్డర్‌తో పాటు రెండు ప్లేట్ల ఫ్రైడ్ చికెన్ ఫిల్లెట్స్‌ను ఫుడ్ పాండా యాప్‌లో ఆర్డర్ చేసింది. అయితే అనూహ్యంగా 42 మంది డెలివరీ బాయ్స్ తను ఆర్డర్ చేసిన ఫుడ్ ప్యాకెట్స్‌తో ఆమె ఉంటున్న వీధిలోకి వచ్చారు. ఆ వీధి మొత్తం డెలివరీ బాయ్స్ బైక్స్‌తో నిండిపోయింది. ఏం జరుగుతుందో తెలియక వీధీలోని వారంతా ఆశ్చర్యపోయారు. ఆ చిన్నారి ఫుడ్ ఆర్డర్ చేసింది కానీ, స్లో ఇంటర్నెట్ కారణంగా యాప్‌లో టెక్నికల్ ఎర్రర్ తలెత్తడంతో ఆ చిన్నారి పదే పదే ఆర్డర్ చేయడానికి ప్రయత్నించింది.

ఆ ఆర్డర్ 42 మందికి డెలివరీ బాయ్స్‌కు చేరడంతో వారంతా ఫుడ్ ప్యాకెట్లతో ఆమె ఇంటికి వచ్చేశారు. అప్పుడు ఆ చిన్నారి, తన నానమ్మ తప్ప ఇంట్లో ఎవరూ లేరు. అంతేకాదు తన దగ్గర ఒక ఆర్డర్‌కు సరిపడేన్ని డబ్బులు మాత్రమే ఉన్నాయి. దీంతో ఆ వీధిలోని చాలామంది కొన్ని ఫుడ్ ప్యాకెట్లను కొనుక్కున్నారు. అయితే ఈ సంఘటనను ఆ వీధిలోని ఒక వ్యక్తి వీడియో తీసి, ఫేస్‌బుక్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. పాపం ఆ చిన్నారి అంతమంది డెలివరీ బాయ్స్ ఇంటికి రావడంతో భయపడిపోయి, ఏడ్చేసింది.

Tags:    

Similar News