జమ్మూకాశ్మీర్‌లో కాల్పుల కలకలం.. ఉగ్రవాది హతం
దిశ, వెబ్‌డెస్క్ : జమ్మూకాశ్మీర్‌లో మరోసారి కాల్పుల కలకలం రేపాయి. కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లా కాష్వాలో తెల్లవారు జామున జరిగిన ఎన్ కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. అయితే ఉగ్రవాదులకు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించినట్టు జమ్మూకాశ్మీర్ పోలీసులు తెలిపారు. బుధవారం సాయంత్రం చిత్రగామ్‌లో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో ఓ పౌరుడు గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టి, ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు […]
దిశ, వెబ్‌డెస్క్ : జమ్మూకాశ్మీర్‌లో మరోసారి కాల్పుల కలకలం రేపాయి. కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లా కాష్వాలో తెల్లవారు జామున జరిగిన ఎన్ కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. అయితే ఉగ్రవాదులకు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించినట్టు జమ్మూకాశ్మీర్ పోలీసులు తెలిపారు. బుధవారం సాయంత్రం చిత్రగామ్‌లో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో ఓ పౌరుడు గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టి, ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున గాలింపు బృందాల కాల్పుల్లో అనాయత్ అహ్మద్ దార్ అనే ఉగ్రవాది హతమయినట్టు అధికారులు తెలిపారు.