బిహార్‌లో మరో మాంఝీ..

దిశ, వెబ్‌డెస్క్: కృషి, పట్టుదల, ఓపిక ఉంటే ఏదైనా సాధించవచ్చని అందరికీ తెలుసు. కానీ పని ప్రారంభించిన కొన్ని రోజులకే విసుగొచ్చి దాన్ని మధ్యలోనే వదిలేస్తారు. కానీ నిబద్ధతగా ఉండి, లక్ష్యాన్ని గురి చూసి కొట్టగలిగితే విజయం తప్పక వరిస్తుందని బిహార్‌లోని కొథిలావాకు చెందిన వ్యక్తి మరోసారి నిరూపించాడు. అతను చేసిన పనేంటో పూర్తిగా తెలిస్తే అతని ఓపికకు చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. అలాగని తనకు మాత్రమే ఉపయోగపడే స్వార్థపూరిత ఆలోచనలతో చేసిన పని కాదది. అందరి బాగు […]

Update: 2020-09-14 04:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: కృషి, పట్టుదల, ఓపిక ఉంటే ఏదైనా సాధించవచ్చని అందరికీ తెలుసు. కానీ పని ప్రారంభించిన కొన్ని రోజులకే విసుగొచ్చి దాన్ని మధ్యలోనే వదిలేస్తారు. కానీ నిబద్ధతగా ఉండి, లక్ష్యాన్ని గురి చూసి కొట్టగలిగితే విజయం తప్పక వరిస్తుందని బిహార్‌లోని కొథిలావాకు చెందిన వ్యక్తి మరోసారి నిరూపించాడు. అతను చేసిన పనేంటో పూర్తిగా తెలిస్తే అతని ఓపికకు చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. అలాగని తనకు మాత్రమే ఉపయోగపడే స్వార్థపూరిత ఆలోచనలతో చేసిన పని కాదది. అందరి బాగు కోసం కష్టపడి చేసిన పని. తన ముప్పై ఏళ్ల కష్టానికి ఇప్పుడు ప్రశంసలు దక్కుతున్నాయి. నిజానికి ఆయన చేసిన పనికి ఆ ప్రాంత రైతులు ఆయనకు ఎంతో రుణపడి ఉన్నామని చెబుతున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఏం చేశాడు?

ఆ వ్యక్తి పేరు లౌంగీ భుయాన్. రోజూ తన పశువులను మేపడానికి చేను దగ్గరకు వెళ్లేవాడు. తన భూమి అలా బీడుగా మారడానికి నీళ్ల సౌకర్యం లేకపోవడమేనని గ్రహించాడు. తనతో పాటు తనలాగే బీడు భూమి ఉన్న రైతులు చాలా మంది ఉన్నారని తెలుసుకున్నాడు. వాళ్లందరూ వ్యవసాయం చేసుకునే వీలు లేక పొట్టకూటి కోసం పట్నం వెళ్లిపోయారు. కానీ భుయాన్ అలా వెళ్లలేదు. తన చేనుకు నీళ్లు రప్పించి పంట పండించాలనుకున్నాడు. తన చేనుకు దగ్గరలో ఉన్న కుంటలో నీళ్లు ఉంటే అక్కడి నుంచి నీటిని ఇటువైపు మళ్లించుకోవచ్చు. కానీ ఆ కుంట నిండేంత వర్షం పడట్లేదు. అలా ఒకరోజు ఆ కుంట దగ్గర కూర్చునప్పుడు వర్షం పడింది. ఆ సమయంలో దానికి పక్కనే ఉన్న కొండ మీద పడిన వర్షం నేరుగా వెళ్లి దూరంగా ఉన్న నదిలో కలుస్తుండటం భుయాన్ గమనించాడు. అదే నీటిని ఇటు కుంట వైపు మళ్లించాలని నిశ్చయించుకున్నాడు. 30 ఏళ్ల పాటు ప్రతిరోజూ కొద్ది కొద్దిగా తవ్వుకుంటూ 3 కి.మీ.ల కాలువను ఇటీవల పూర్తి చేశాడు. ఈ కాలువను తవ్వడంలో ఏరోజు కూడా అతనికి ఎవరూ సాయం చేయలేదు. ఒక్కడే ముప్పై ఏళ్లు కష్టపడి తవ్వాడు. ఈ మధ్య కురిసిన వర్షపు నీరు కొండ మీది నుంచి నేరుగా కుంటలోకి రావడంతో భుయాన్‌ను స్థానికులు పొగడ్తలతో ముంచేస్తున్నారు.

Read Also…

రూ. 60 లక్షలు పలికిన లింకన్ వెంట్రుకలు

Full View

Tags:    

Similar News