మరోసారి భగ్గుమన్న చమురు ధరలు

దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా చమురు ధరలు మరోసారి పెరిగాయి. క్రమంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడిపై పెను భారాన్ని మోపుతున్నాయి. ఇప్పటికే నెలలో నాలుగుసార్లు పెరిగిన చమురు ధరలు మంగళవారం రిపబ్లిక్ డే సందర్భంగా మరో 35పైసలు పెరిగింది. లాక్‌డౌన్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సామాన్యుడిపై పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వారిని మరింత ఇబ్బందులకు గురిచేస్తోంది. చమురు ధరల పెరుగుదలతో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో పేదప్రజలు అల్లాడుతున్నారు. తాజాగా పెరిగిన ధరల […]

Update: 2021-01-26 00:36 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా చమురు ధరలు మరోసారి పెరిగాయి. క్రమంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడిపై పెను భారాన్ని మోపుతున్నాయి. ఇప్పటికే నెలలో నాలుగుసార్లు పెరిగిన చమురు ధరలు మంగళవారం రిపబ్లిక్ డే సందర్భంగా మరో 35పైసలు పెరిగింది. లాక్‌డౌన్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సామాన్యుడిపై పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వారిని మరింత ఇబ్బందులకు గురిచేస్తోంది.

చమురు ధరల పెరుగుదలతో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో పేదప్రజలు అల్లాడుతున్నారు. తాజాగా పెరిగిన ధరల ప్రకారం.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోలు రూ.89.51, డీజిల్ రూ.83.19 ఉండగా, ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.92.62, డీజిల్ ధర రూ.83.03గా కొనసాగుతోంది.

Tags:    

Similar News