ఉసేన్ బోల్ట్‌తో పోలికా..!

          మంగళూరు సమీపంలోని ఐకళ ప్రాంతంలో నిర్వహించిన ‘కంబళ’ పోటీల్లో శ్రీనివాస గౌడ అనే యువకుడు 9.55 సెకన్లలో వంద మీటర్లు పరుగెత్తి ఉసేన్ బోల్ట్‌ను తలపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోలిక పట్ల కంబళ పాలక మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రదర్శనను ‘ఇతరులతో పోల్చడం మాకు ఇష్టం లేదని’ కంబళ అకాడమీ ప్రెసిడెంట్, ప్రొఫెసర్ గుణపాల కదంబ తెలిపారు. ‘ఒలింపిక్ నిర్వాహకులు అత్యంత శాస్త్రీయ పద్ధతుల్లో, […]

Update: 2020-02-15 05:19 GMT

మంగళూరు సమీపంలోని ఐకళ ప్రాంతంలో నిర్వహించిన ‘కంబళ’ పోటీల్లో శ్రీనివాస గౌడ అనే యువకుడు 9.55 సెకన్లలో వంద మీటర్లు పరుగెత్తి ఉసేన్ బోల్ట్‌ను తలపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోలిక పట్ల కంబళ పాలక మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రదర్శనను ‘ఇతరులతో పోల్చడం మాకు ఇష్టం లేదని’ కంబళ అకాడమీ ప్రెసిడెంట్, ప్రొఫెసర్ గుణపాల కదంబ తెలిపారు. ‘ఒలింపిక్ నిర్వాహకులు అత్యంత శాస్త్రీయ పద్ధతుల్లో, ప్రామాణికమైన ఎలక్ట్రానిక్ పరికరాలతో పరుగు వేగాన్ని లెక్కిస్తారని’ వెల్లడించారు. అయితే ఈ రోజు పలు వార్తా పత్రికలు, పాత్రికేయలు శ్రీనివాస గౌడను ఉసేన్ బోల్ట్‌తో పోలుస్తూ వార్తలు ప్రచురించడతో ఆయన ఈ విధంగా స్పందించారు.

Tags:    

Similar News