ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్‌కు సర్జరీ!

ముంబయి: మహారాష్ట్రలో రాజకీయాలు హీటెక్కిన కీలక సమయంలో అధికారంలోని ఎన్‌సీపీ పార్టీ చీఫ్ శరద్ పవార్ అస్వస్థకు గురయ్యారు. ఆయన పొట్టలో నొప్పి రావడంతో ముంబయిలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌కు తీసుకెళ్లినట్టు ఎన్‌సీపీ లీడర్ నవాబ్ మాలిక్ వివరించారు. చెక్ అప్‌ల తర్వాత పవార్ గాల్ బ్లాడర్(పిత్తాశయం)లో సమస్య ఉన్నట్టు తేలిందని తెలిపారు. ఈ సమస్య కారణంగా ఆయన తన బ్లడ్ థిన్నింగ్ మెడికేషన్‌ను నిలిపేశారని పేర్కొన్నారు. అలాగే, ఈ నెల 31న మరోసారి ఆస్పత్రికి తీసుకెళ్తామని, […]

Update: 2021-03-29 00:50 GMT

ముంబయి: మహారాష్ట్రలో రాజకీయాలు హీటెక్కిన కీలక సమయంలో అధికారంలోని ఎన్‌సీపీ పార్టీ చీఫ్ శరద్ పవార్ అస్వస్థకు గురయ్యారు. ఆయన పొట్టలో నొప్పి రావడంతో ముంబయిలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌కు తీసుకెళ్లినట్టు ఎన్‌సీపీ లీడర్ నవాబ్ మాలిక్ వివరించారు. చెక్ అప్‌ల తర్వాత పవార్ గాల్ బ్లాడర్(పిత్తాశయం)లో సమస్య ఉన్నట్టు తేలిందని తెలిపారు. ఈ సమస్య కారణంగా ఆయన తన బ్లడ్ థిన్నింగ్ మెడికేషన్‌ను నిలిపేశారని పేర్కొన్నారు. అలాగే, ఈ నెల 31న మరోసారి ఆస్పత్రికి తీసుకెళ్తామని, అప్పుడు ఎండోస్కోపీ, సర్జరీ కూడా చేయనున్నట్టు వెల్లడించారు. ఫలితంగా తదుపరి నోటీసుల వరకు ఆయన ప్రొగ్రామ్స్ అన్నీ రద్దయినట్టు పరిగణించాల్సిందిగా వివరించారు.

మహారాష్ట్ర హోం మంత్రి, ఎన్‌సీపీ లీడర్ అనిల్ దేశ్‌ముఖ్‌పై తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఓ కుదుపునకు లోనైంది. అధికారంలోని మహావికాస్ అగాదీకి ఏ అపాయం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ రహస్యంగా భేటీ అయినట్టు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే శివసేన నేతలూ అనిల్ దేశ్‌ముఖ్‌పై పదునైన ఆరోపణలు చేశారు. దీంతో శివసేన ప్రభుత్వం నుంచి ఎన్‌సీపీ మద్దతు ఉపసంహరించుకుని బీజేపీకి సపోర్టునిస్తుందా? అనే ఊహాగానాలు ఉధృతమయ్యాయి.

Tags:    

Similar News