28న టీఎస్‌పీఎస్సీ కార్యాలయ ముట్టడి
దిశ, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్), ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) డిమాండ్ చేసింది. కేసీఆర్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 28న టీఎస్ పీఎస్సీ కార్యాలయ ముట్టడి చేయనున్నట్టు పీవైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ ప్రదీప్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, అశోక్ నగర్ ప్రాంతాల్లోని […]
దిశ, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్), ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) డిమాండ్ చేసింది. కేసీఆర్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 28న టీఎస్ పీఎస్సీ కార్యాలయ ముట్టడి చేయనున్నట్టు పీవైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ ప్రదీప్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, అశోక్ నగర్ ప్రాంతాల్లోని కోచింగ్ సెంటర్లలో బుధవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. నిరుద్యోగ అభ్యర్థులను ఉద్దేశించి కేఎస్ ప్రదీప్ మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. అయినా కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే వెంటనే ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28న టీఎస్‌పీఎస్సీ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చామనీ, నిరుద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి పి.మహేష్, నగర అధ్యక్షులు అనిల్, నిరుద్యోగ జాక్ అజయ్, సుమంత్ తదితరులు పాల్గొన్నారు.