బిగ్ బ్రేకింగ్.. ఒమిక్రాన్ తొలి మరణం నమోదు.. ఎక్కడంటే?

దిశ, వెబ్‌డెస్క్: గత కొద్దిరోజులుగా ప్రపంచాన్ని ఆందోళన కలిగిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్‌కు సంబంధించి తొలి మరణం నమోదైంది. యూకేలో తొలి మరణం నమోదైనట్లు బ్రిటన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీంతో అక్కడి ప్రజల్లో మరింత ఆందోళన కలుగుతోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందగా.. మరణం సంభవించలేదు. ఇప్పుడు మరణం నమోదవడం కలకలం సృష్టిస్తోంది. కాగా యూకేలో ఒమిక్రాన్ విజృంభిస్తోంది. కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఒమిక్రాన్ కేసుల్లో యూకే తొలి స్థానంలో ఉంది.  దీంతో యూకేలో […]

Update: 2021-12-13 06:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: గత కొద్దిరోజులుగా ప్రపంచాన్ని ఆందోళన కలిగిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్‌కు సంబంధించి తొలి మరణం నమోదైంది. యూకేలో తొలి మరణం నమోదైనట్లు బ్రిటన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీంతో అక్కడి ప్రజల్లో మరింత ఆందోళన కలుగుతోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందగా.. మరణం సంభవించలేదు. ఇప్పుడు మరణం నమోదవడం కలకలం సృష్టిస్తోంది.

కాగా యూకేలో ఒమిక్రాన్ విజృంభిస్తోంది. కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఒమిక్రాన్ కేసుల్లో యూకే తొలి స్థానంలో ఉంది. దీంతో యూకేలో ఒమిక్రాన్ ఎమర్జెన్సీ ప్రకటించారు.

Tags:    

Similar News