మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా నేడు విడుదల
ఏడు నెలల నిర్బంధం అనంతరం జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఈరోజు (మంగళవారం) విడుదల కానున్నారు. గత ఏడాది ఆగస్టులో ఆర్టికల్ 370, 35ఏ రద్దు, జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను తొలగించి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కశ్మీర్‌లోని వందల మంది రాజకీయ నాయకులను కేంద్ర ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకుంది. అందులో ఒమర్ అబ్దుల్లా కూడా ఉన్నారు. గృహ నిర్బంధాన్ని సవాల్ చేస్తూ ఒమర్ సోదరి సుప్రీంకోర్టులో పిటిషన్ […]
ఏడు నెలల నిర్బంధం అనంతరం జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఈరోజు (మంగళవారం) విడుదల కానున్నారు. గత ఏడాది ఆగస్టులో ఆర్టికల్ 370, 35ఏ రద్దు, జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను తొలగించి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కశ్మీర్‌లోని వందల మంది రాజకీయ నాయకులను కేంద్ర ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకుంది. అందులో ఒమర్ అబ్దుల్లా కూడా ఉన్నారు. గృహ నిర్బంధాన్ని సవాల్ చేస్తూ ఒమర్ సోదరి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వెంటనే విడుదల చేయాలని కోరింది. దీనిపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరగా ఒమర్ విడుదలకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. గృహనిర్బంధంలో ఉన్న మాజీ సీఎం ఫారుఖ్ అబ్దుల్లాను మార్చి 13న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
Tags: Omar Abdullah,Released ,After Over 7 Months ,Detention