చనిపోయిన పేషెంట్ కండీషన్ క్రిటికల్.. సినీఫక్కీలో వైద్యుల ప్లాన్

దిశ, కొత్తగూడెం: వైద్యుల నిర్లక్ష్యం ఓ వృద్ధురాలి ప్రాణాన్ని బలితీసుకుంది. అది కప్పిపుచ్చుకోవడానికి చనిపోయిన పేషెంట్ పరిస్థితి క్రిటికల్‌గా ఉందంటూ సదరు ఆస్పత్రి వైద్యులు హంగామా సృష్టించారు. ఈ వ్యవహారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగుచూసింది. కొత్తగూడెంలోని స్టార్ హాస్పిటల్‌లో గత ఐదురోజుల క్రితం సుజాతనగర్‌ రెడ్డి పాలెంకు చెందిన ముసుగు మల్లమ్మ(75) అడ్మిట్ అయ్యారు. తొంటికి ఫ్రాక్షర్ అయిందన్న నేపథ్యంలో వైద్యులు ఆపరేషన్ చేశారు. 5 రోజుల పాటు చికిత్స చేసి.. వేల రూపాయల బిల్లు […]

Update: 2021-08-11 11:12 GMT

దిశ, కొత్తగూడెం: వైద్యుల నిర్లక్ష్యం ఓ వృద్ధురాలి ప్రాణాన్ని బలితీసుకుంది. అది కప్పిపుచ్చుకోవడానికి చనిపోయిన పేషెంట్ పరిస్థితి క్రిటికల్‌గా ఉందంటూ సదరు ఆస్పత్రి వైద్యులు హంగామా సృష్టించారు. ఈ వ్యవహారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగుచూసింది. కొత్తగూడెంలోని స్టార్ హాస్పిటల్‌లో గత ఐదురోజుల క్రితం సుజాతనగర్‌ రెడ్డి పాలెంకు చెందిన ముసుగు మల్లమ్మ(75) అడ్మిట్ అయ్యారు. తొంటికి ఫ్రాక్షర్ అయిందన్న నేపథ్యంలో వైద్యులు ఆపరేషన్ చేశారు. 5 రోజుల పాటు చికిత్స చేసి.. వేల రూపాయల బిల్లు వసూలు చేశారు. చివరకు వైద్యం వికటించి మల్లమ్మ మృతి చెందింది. దీంతో వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి పేషెంట్‌ను తీసుకెళ్లాలి.. కండీషన్ క్రిటికల్‌గా ఉందంటూ వైద్యులు హంగామా చేశారు. అనుమానం వచ్చిన కుటుంబీకులు మల్లమ్మ వద్దకు వెళ్లి చూడగా అప్పటికే చనిపోయినట్టు గ్రహించి.. ఆస్పత్రి సిబ్బందిని నిలదీశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆస్పత్రిని సీజ్ చేయాలని ఆందోళన చేపట్టారు.

Tags:    

Similar News