వృద్ధురాలు సజీవ దహనం

దిశ, జగిత్యాల: గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఒకవైపు.. ఇంట్లోకి చేరిన చీమల బెడద మరో వైపు.. చీమల నుంచి రక్షించుకోవాడానికి నిప్పు పెట్టిన ఓ మహిళ సజీవ దహనం అయింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే. రాజేశం గుట్టకు చెందిన సుకన్య (60) అనే వృద్ధురాలు తన ఇంట్లోని ఓ గదిలో చీమల బెడదతో తీవ్రం కావడంతో, వాటిని చంపడానికి కిరోసిన్ పోసి నిప్పంటించింది. మంటలు తీవ్రం […]

Update: 2020-08-14 07:24 GMT

దిశ, జగిత్యాల: గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఒకవైపు.. ఇంట్లోకి చేరిన చీమల బెడద మరో వైపు.. చీమల నుంచి రక్షించుకోవాడానికి నిప్పు పెట్టిన ఓ మహిళ సజీవ దహనం అయింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే. రాజేశం గుట్టకు చెందిన సుకన్య (60) అనే వృద్ధురాలు తన ఇంట్లోని ఓ గదిలో చీమల బెడదతో తీవ్రం కావడంతో, వాటిని చంపడానికి కిరోసిన్ పోసి నిప్పంటించింది. మంటలు తీవ్రం కావడంతో సుకన్య కూడా ఆ మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్త వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News