కరోనా భయంతో వృద్ధ దంపతుల ఆత్మహత్య

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే తమకు ఎక్కడ వైరస్ సోకిందేమోననే భయంతో కొంతమంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా రాష్ట్రంలో ఓ వృద్ధ జంట కొవిడ్ భయంతో ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసు‌స్టేషన్ పరిధిలో కరోనా భయంతో వృద్ధ జంట ఆత్మహత్య చేసుకుంది. రాజ్‌భవన్ సమీపంలోని ఎంఎస్ మక్తాలో ఉన్న రాజ్‌నగర్‌లో నివాసముంటున్న దంపతులు.. కరోనా భయంతో కూల్ డ్రింక్‌లో విషం కలుపుకుని […]

Update: 2020-08-01 10:22 GMT

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే తమకు ఎక్కడ వైరస్ సోకిందేమోననే భయంతో కొంతమంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా రాష్ట్రంలో ఓ వృద్ధ జంట కొవిడ్ భయంతో ఆత్మహత్యకు పాల్పడింది.

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసు‌స్టేషన్ పరిధిలో కరోనా భయంతో వృద్ధ జంట ఆత్మహత్య చేసుకుంది. రాజ్‌భవన్ సమీపంలోని ఎంఎస్ మక్తాలో ఉన్న రాజ్‌నగర్‌లో నివాసముంటున్న దంపతులు.. కరోనా భయంతో కూల్ డ్రింక్‌లో విషం కలుపుకుని తాగి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. విచారణలో భాగంగా..

దంపతులిద్దరూ పది రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లుగా తేలింది. తాము కూడా కొవిడ్ బారిన పడ్డామనుకోని.. తమ నుంచి ఇతర కుటుంబ సభ్యులకు వైరస్ వ్యాప్తి చెందుతుందనే భయంతో దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News