ఆగష్టు 15న రానున్న ఓలా తొలి ఈ-స్కూటర్
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఎంతో ఆసక్తి రేకెత్తించిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల తేదీని కంపెనీ గ్రూప్ సీఎఓ భవీష్ అగర్వాల్ ప్రకటించారు. దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ తన మొట్టమొదటి ఓలా ఈ-స్కూటర్‌ను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15వ తేదీన మార్కెట్లోకి తీసుకురానున్నట్టు అధికారికంగా వెల్లడించారు. భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవం రోజున కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ఆరోజే ఈ-స్కూటర్‌కు సంబంధించిన ఫీచర్లు, ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వారికి డెలివరీ […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఎంతో ఆసక్తి రేకెత్తించిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల తేదీని కంపెనీ గ్రూప్ సీఎఓ భవీష్ అగర్వాల్ ప్రకటించారు. దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ తన మొట్టమొదటి ఓలా ఈ-స్కూటర్‌ను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15వ తేదీన మార్కెట్లోకి తీసుకురానున్నట్టు అధికారికంగా వెల్లడించారు.
భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవం రోజున కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ఆరోజే ఈ-స్కూటర్‌కు సంబంధించిన ఫీచర్లు, ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వారికి డెలివరీ చేసే వివరాలను ప్రకటించనున్నట్టు భవీష్ అగర్వాల్ స్పష్టం చేశారు. గత నెల ఓలా ఈ-స్కూటర్‌కు సంబంధించి బుకింగ్‌లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. రూ. 499తో బుకింగ్ స్కూటర్‌ను బుక్ చేసుకునే వెసులుబాటు ఇవ్వగా, ఒక్కరోజులోనే లక్షకు మించి బుకింగ్‌లు నమోదయ్యాయి.
అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించి భారత్‌లో తయారు చేస్తున్న ఓలా స్కూటర్‌పై మార్కెట్లో భారీ అంచనాలున్నాయి. స్కూటర్ ప్రయాణ వేగంతో పాటు ఛార్జింగ్, సీట్ కింద బూట్ స్పేస్ లాంటి అన్ని విభాగాల్లో అత్యుత్తమ ప్రయోజనాలు ఉంటాయని కంపెనీ చెబుతోంది. ఇప్పటికే ఈ స్కూటర్‌ను పది వేర్వేరు రంగుల్లో తీసుకురానున్నట్టు కంపెనీ వెల్లడించింది.