12 శాతం తగ్గిన పెట్రోల్, డీజిల్!
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా ధాటికి అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పతనం దిశగా కొనసాగుతున్నాయి. 13 నెలల కనిష్ఠ స్థాయికి చేరుకున్న చమురు ధరలు, నెల వ్యవధిలోనే రూ. 4 వరకూ తగ్గాయి. చమురు ధరలు శుక్రవారంతో వరుసగా ఆరవ సెషన్‌లోనూ పడిపోయాయి. ఒక్క వారంలోనే 12శాతం దిగజారింది. గత నాలుగేళ్ల కాలంలో ఇదే అత్యధిక పతనమని విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి ముఖ్యంగా చైనా వెలుపల మొత్తం 46 దేశాల్లో కరోనా మరణాలు పెరగడమే అని […]
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా ధాటికి అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పతనం దిశగా కొనసాగుతున్నాయి. 13 నెలల కనిష్ఠ స్థాయికి చేరుకున్న చమురు ధరలు, నెల వ్యవధిలోనే రూ. 4 వరకూ తగ్గాయి. చమురు ధరలు శుక్రవారంతో వరుసగా ఆరవ సెషన్‌లోనూ పడిపోయాయి. ఒక్క వారంలోనే 12శాతం దిగజారింది. గత నాలుగేళ్ల కాలంలో ఇదే అత్యధిక పతనమని విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి ముఖ్యంగా చైనా వెలుపల మొత్తం 46 దేశాల్లో కరోనా మరణాలు పెరగడమే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారుతుందనే ఆందోళన మొదలైంది.
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 76.47గా ఉంది. అలాగే, డీజిల్ ధర రూ. 70.37గా ఉంది. దేశంలోని ఇతర నగరాల్లో ధరలను పరిశీలిస్తే, రజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ. 71.96, చెన్నైలో రూ. 74.75, ముంబైలో రూ. 77.62, బెంగళూరులో రూ. 74.41గా ఉంది.