తగ్గిన ముడిచమురు ధరలు..21 ఏళ్ల కనిష్టానికి!

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-29 ప్రభావంతో అంతర్జాతీయంగా చమురు ధరలు మరింత తగ్గిపోయాయి. దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ మాంద్యంలోకి వెళ్తున్నాయి. సోమవారం డబ్ల్యూటీఐ ముడిచమురు బ్యారెల్‌కు ఒకేసారి 15 డాలర్ల కిందకు పడిపోయాయి. ఇది ఏకంగా 21 ఏళ్ల కనిష్ఠమని నిపుణులు చెబుతున్నారు. కరోనా కారణంగా రవాణా, సరఫరా లేకపోవడంతో చమురుకు భారీగా డిమాండ్ తగ్గింది. అదనపు ఆయిల్ నిల్వలకు సంబంధించి పెరిగిన ఆందోళనల కారణంగానే చమురు ధరలు తగ్గడానికి కారణమని తెలుస్తోంది. ఇటీవల చమురు ధరలు తగ్గకుండా […]

Update: 2020-04-20 07:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-29 ప్రభావంతో అంతర్జాతీయంగా చమురు ధరలు మరింత తగ్గిపోయాయి. దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ మాంద్యంలోకి వెళ్తున్నాయి. సోమవారం డబ్ల్యూటీఐ ముడిచమురు బ్యారెల్‌కు ఒకేసారి 15 డాలర్ల కిందకు పడిపోయాయి. ఇది ఏకంగా 21 ఏళ్ల కనిష్ఠమని నిపుణులు చెబుతున్నారు. కరోనా కారణంగా రవాణా, సరఫరా లేకపోవడంతో చమురుకు భారీగా డిమాండ్ తగ్గింది. అదనపు ఆయిల్ నిల్వలకు సంబంధించి పెరిగిన ఆందోళనల కారణంగానే చమురు ధరలు తగ్గడానికి కారణమని తెలుస్తోంది.

ఇటీవల చమురు ధరలు తగ్గకుండా స్థిరంగా ఉండేందుకు చమురు కంపెనీలు చర్చించాయి. ఒపెక్ దేశాలు, అనుబంధ సంస్థల మధ్య చమురు ఉత్పత్తిని తగ్గించేందుకు ఒప్పందం కుదిరింది. అయినా సరే, చమురు ధరలు తగ్గడం గమనార్హం. బ్రెంట్ క్రూడాయిల్ ధరలు కూడా తగ్గి 26 డాలర్లకు క్షీణించింది. అంతర్జాతీయంగా ధరలు తగ్గుతున్నప్పటికీ దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. దేశంలో గడిచిన 34 రోజులుగా ధరలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ రూ. 73.97 ఉండగా, డీజిల్ రూ. 67.82 వద్ద ఉంది.

Tags: WTI oil price, Oil price, crude oil price, covid 19, coronavirus,Brent crude oil price

Tags:    

Similar News