జూరాల ప్రాజెక్టు 20గేట్లు ఎత్తివేత

దిశ, వెబ్‌డెస్క్: కృష్ణానది పరవళ్లు తొక్కుతుండటంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు 20గేట్లు ఎత్తిన అధికారులు లక్షా 50వేలకు పైగా క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఎగవ.. దిగువన విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.571 టీఎంసీలను నిల్వ ఉంచుతూ వరదను విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం 317.980 […]

Update: 2020-08-15 06:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: కృష్ణానది పరవళ్లు తొక్కుతుండటంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు 20గేట్లు ఎత్తిన అధికారులు లక్షా 50వేలకు పైగా క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఎగవ.. దిగువన విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.571 టీఎంసీలను నిల్వ ఉంచుతూ వరదను విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం 317.980 మీటర్లుగా ఉంది. మరో మూడ్రోజుల పాటు ప్రాజెక్టుకు వరద కొనసాగే అవకాశం ఉంది.

Tags:    

Similar News