పులిచింతల ప్రాజెక్టుకు స్టాప్‌లాక్ గేటు అమర్చిన అధికారులు
దిశ, ఏపీ బ్యూరో: పులిచింతల ప్రాజెక్ట్ వద్ద కొట్టుకుపోయిన 16వ నెంబరు క్రస్ట్ గేటు స్థానంలో అధికారులు స్టాప్ లాక్ గేటును అమర్చారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 80మంది సిబ్బంది 20 గంటలపాటు శ్రమించి గేటు ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి 1గంటకు ఫ్లడ్ లైట్ల వెలుతురులో 11 ఎలిమెంట్లను టెక్నికల్ సిబ్బంది అమర్చింది. అనంతరం ఆదివారం ఉదయం స్టాప్ లాక్ గేటును పూర్తిగా అమర్చారు. దీంతో పులిచింతల ప్రాజెక్టు నందు అన్ని గేట్లు మూసి వేసి […]
దిశ, ఏపీ బ్యూరో: పులిచింతల ప్రాజెక్ట్ వద్ద కొట్టుకుపోయిన 16వ నెంబరు క్రస్ట్ గేటు స్థానంలో అధికారులు స్టాప్ లాక్ గేటును అమర్చారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 80మంది సిబ్బంది 20 గంటలపాటు శ్రమించి గేటు ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి 1గంటకు ఫ్లడ్ లైట్ల వెలుతురులో 11 ఎలిమెంట్లను టెక్నికల్ సిబ్బంది అమర్చింది. అనంతరం ఆదివారం ఉదయం స్టాప్ లాక్ గేటును పూర్తిగా అమర్చారు. దీంతో పులిచింతల ప్రాజెక్టు నందు అన్ని గేట్లు మూసి వేసి నీటి నిల్వను ప్రారంభించారు అధికారులు. ఎగువ సాగర్ నుండి వస్తున్న 40వేల క్యూసెక్కుల నీటిని రిజర్వాయర్‌లో నింపేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 6న పులిచింతల ప్రాజెక్టుకు ఉధృతంగా వస్తున్న వరద నీటిని ప్రకాశం బ్యారేజ్‌కు వదిలేందుకు రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తుతుండగా, ప్రాజెక్ట్ 16వ గేట్ హైడ్రాలిక్ గడ్డర్ తెగిపడడంతో క్రస్ట్‌గేటుతోపాటు మోటార్ మొత్తం 500 మీటర్ల వరకు వరద నీటిలో కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే.