మిల్లర్లు, ఐకేపీ సెంటర్లు కుమ్మక్కు.. కాంటాల పేరుతో దగా

దిశ, పరకాల: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తుంది. అందులో భాగంగా రైతులు తమ పంట ఉత్పత్తులు దళారులకు విక్రయించి మోస పోకుండా ఉండటం కోసం గ్రామాల్లో ఐకేపీ, పీఏసీఎస్, ఓడీసీఎంఎస్, ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. రైతులు మహిళలు ప్రజలు భాగస్వామ్యం‌గా ఉండి ఎలాంటి అవకతవకలు జరగకుండా రైతులు తమ ఉత్పత్తులు విక్రయించుకునే వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వ లక్ష్యానికి విరుద్ధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల మిల్లర్లు […]

Update: 2021-11-27 02:58 GMT

దిశ, పరకాల: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తుంది. అందులో భాగంగా రైతులు తమ పంట ఉత్పత్తులు దళారులకు విక్రయించి మోస పోకుండా ఉండటం కోసం గ్రామాల్లో ఐకేపీ, పీఏసీఎస్, ఓడీసీఎంఎస్, ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. రైతులు మహిళలు ప్రజలు భాగస్వామ్యం‌గా ఉండి ఎలాంటి అవకతవకలు జరగకుండా రైతులు తమ ఉత్పత్తులు విక్రయించుకునే వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వ లక్ష్యానికి విరుద్ధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల మిల్లర్లు కుమ్మక్కై రైతును మాయిశ్చర్ పేరుతో నిండా ముంచుతున్నారు. గత 15 రోజులుగా కల్లాల్లో ధాన్యం రాశులు పోసుకొని రైతులు ఎదురు చూస్తున్నారు.

ప్రభుత్వ నిర్ణయం స్పష్టంగా లేకపోడంతో గ్రామాల్లో కాంటాలు ఇంకా మొదలుకాలేదు ఇది అదునుగా భావించారు ఐకేపీ సెంటర్ నిర్వాహకులు, అంతే మిల్లర్‌లతో అక్రమ దోపిడీకి తెరతీశారు. ఐకేపీ సెంటర్లలో కాంట అయినట్లుగా ట్రక్ చిట్టీలు ఇస్తూ రైతులను నేరుగా మిల్లర్ వద్దకే పంపిస్తున్నారు. అక్కడ మిల్లర్ ఐకేపీ సెంటర్‌తో ముందస్తు చేసుకున్న ఒప్పందం ప్రకారం మాయిశ్చర్ లేదంటూ 3 నుంచి 5 కిలోల తరుగు తీస్తున్నారు. అంతేకాకుండా 100 బస్తాలకు 30 నుంచి 40 కిలోలు సంఘం పేరుతో మరో కొంత తరుగు తీసు భారీ దోపిడీకి తెరతీశారు. ఈ విషయమై దిశ పత్రిక హన్మకొండ జిల్లా నడికూడ మండలం కంఠాత్మకూరులోని సాయి సూర్య రైస్ మిల్లు వెళ్లి పరిశీలించగా ఇందుకు సంబంధించిన అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఉన్నతాధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న దోపిడీని అరికట్టాలని రైతులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News