క్వారంటైన్‌లో ఉంటే రూ.2000 ఇస్తాం: నవీన్ పట్నాయక్
దిశ, వెబ్ డెస్క్: ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ స్వచ్ఛందంగా క్వారంటైన్‌లో ఉండే వారికోసం బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఈ ఆఫర్ ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి వచ్చే వారికోసం అని స్పష్టం చేశారు.ఆయన ఏదీ చేసిన సంచలనమే. అందువల్లే రాష్ట్రానికి వరుసగా ఐదోసారి సీఎంగా పనిచేస్తున్నాడు నవీన్ పట్నాయక్. దేశవ్యాప్తంగా ఇటీవల జరిపిన సర్వేలో పాపులర్ సీఎంల లిస్ట్‌లో మొదటి స్థానాన్ని కూడా సంపాదించారు. ఇదిలా ఉంటే నవీన్.. ఇటీవల ఓ విషయంలో ఏపీ సీఎం […]
దిశ, వెబ్ డెస్క్: ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ స్వచ్ఛందంగా క్వారంటైన్‌లో ఉండే వారికోసం బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఈ ఆఫర్ ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి వచ్చే వారికోసం అని స్పష్టం చేశారు.ఆయన ఏదీ చేసిన సంచలనమే. అందువల్లే రాష్ట్రానికి వరుసగా ఐదోసారి సీఎంగా పనిచేస్తున్నాడు నవీన్ పట్నాయక్. దేశవ్యాప్తంగా ఇటీవల జరిపిన సర్వేలో పాపులర్ సీఎంల లిస్ట్‌లో మొదటి స్థానాన్ని కూడా సంపాదించారు. ఇదిలా ఉంటే నవీన్.. ఇటీవల ఓ విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఫాలో అవుతున్నారు. అదేంటంటే..ఓడిశాలో కరోనా కేసులు ఇప్పటికే 7వేలు దాటేశాయి. లాక్‌డౌన్ సడలింపుల తరువాత అక్కడ రోజురోజుకూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో..ఓడిశా సీఎం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు.
దీంతో ఇతర ప్రదేశాల నుంచి ఓడిశా వచ్చే వారు నిబంధనలను అనుసరిస్తూ ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్‌లో గానీ, హోమ్ క్వారంటైన్‌లో గానీ ఉంటే రూ.2వేల ఇస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారా వైరస్ వ్యాప్తిని తగ్గించే అవకాశంతో పాటు క్వారంటైన్‌లో ఉండేందుకు అందరినీ ఎంకరేజ్ చేసినట్లు అవుతుందని భావించింది. ఈ నేపథ్యంలోనే నవీన్ పట్నాయక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.అలాగే క్వారంటైన్ సెంటర్‌లో గార్డెనింగ్ లాంటి పనులు చేస్తే రోజుకు రూ.150 చెల్లిస్తామని కూడా తెలిపారు.కాగా, ఏపీలో కరోనాను జయించిన వారికి రూ.2వేల జగన్ ప్రభుత్వం ఇస్తోంది. దీని వలన కరోనా బాధితుల్లో ధైర్యం నింపే అవకాశం ఉంటుందని జగన్ ఓ సందర్భంలో ప్రకటించిన విషయం తెలిసిందే.