దేవాలయ భూమి ఆక్రమణ.. ఎవరు పట్టించుకోవట్లేదని ఓ వ్యక్తి ఏకంగా..

దిశ, హుస్నాబాద్: దుర్గమ్మ దేవాలయం భూమి అన్యాక్రాంతమవుతుందని ఓ వ్యక్తి మంగళవారం ఏకంగా గ్రామపంచాయతీ కార్యాలయంలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడు ధోని రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో బెజ్జంకి గ్రామ శివారు తోకబొందా చెరువు సమీపంలోని 1051 సర్వే నెంబర్‌లో ప్రభుత్వ అసైన్డ్ భూమి ఉందన్నారు. అందులో 1.20 ఎకరాల్లో దశాబ్దాల చరిత్ర కలిగిన దుర్గమ్మ దేవాలయ భూమి ఉందని తెలిపారు. దేవాలయ భూమి అక్రమార్కుల చేతిలో అన్యాక్రాంతం అవుతుందని […]

Update: 2021-12-14 10:49 GMT

దిశ, హుస్నాబాద్: దుర్గమ్మ దేవాలయం భూమి అన్యాక్రాంతమవుతుందని ఓ వ్యక్తి మంగళవారం ఏకంగా గ్రామపంచాయతీ కార్యాలయంలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడు ధోని రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో బెజ్జంకి గ్రామ శివారు తోకబొందా చెరువు సమీపంలోని 1051 సర్వే నెంబర్‌లో ప్రభుత్వ అసైన్డ్ భూమి ఉందన్నారు. అందులో 1.20 ఎకరాల్లో దశాబ్దాల చరిత్ర కలిగిన దుర్గమ్మ దేవాలయ భూమి ఉందని తెలిపారు. దేవాలయ భూమి అక్రమార్కుల చేతిలో అన్యాక్రాంతం అవుతుందని నాలుగేళ్ల క్రితం బెజ్జంకి తహశీల్దార్, ఎంపీడీవో, ఎంపీవో, గ్రామ సర్పంచి, కార్యదర్శులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆరోపించారు. గతంలో గ్రామపంచాయతీ ఇన్చార్జి పాలన ఉన్నప్పుడు ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అక్రమంగా ఇంటి నిర్మాణ అనుమతులు పొంది, ఇల్లు నిర్మిస్తున్నారని రవీందర్ తెలిపారు. దేవాలయ భూమిని ఆక్రమించుకున్న సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని గ్రామపంచాయతీ అధికారులకు గ్రామస్తులందరు కలిసి వినతిపత్రం ఇచ్చిన పట్టించుకోకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురై మంగళవారం గ్రామపంచాయతీ కార్యాలయంలోనే ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఆయన పేర్కొన్నారు.

వెంటనే స్పందించిన గ్రామపంచాయతీ సర్పంచ్, అధికారులు, అక్రమ నిర్మాణాలపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రవీందర్ కు హామీ ఇచ్చారని స్థానికులు, గ్రామస్తులు చెప్పారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షులు ధోని అశోక్, గ్రామస్తులు ధోని లక్ష్మణ్, ధోని ప్రభాకర్, శంబు లింగారావు, ధోని మురళి, ధోని నర్సింగరావు, రాంపూర్ రాజేశం, బుర్ర కిషన్, రాములు, ఆంజనేయులు, చందు, రాజేష్, సురేందర్లు అన్యాక్రాంతమవుతున్న దేవాలయ భూమిపై విచారణ జరిపించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున గ్రామస్తులతో ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు.

Tags:    

Similar News