150 ఏళ్ల నాటి పురాతన ఇంట్లో క్షుద్రపూజలు

దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లా బనగానపల్లెలో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. కొండపేటలోని 150 ఏళ్ల నాటి పురాతన ఇంట్లో కొందరు వ్యక్తులు క్షుద్రపూజలు చేస్తున్నట్టు స్థానికులు గుర్తించారు. ఆ పాత ఇంటిని ఇటీవలే రవితేజ అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. ఆ ఇంట్లో గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు చేస్తుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో భయపడిన ముఠా ముగ్గులను చెరిపేసి ఇంటికి తాళం వేసి పరారయ్యారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు […]

Update: 2021-02-11 04:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లా బనగానపల్లెలో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. కొండపేటలోని 150 ఏళ్ల నాటి పురాతన ఇంట్లో కొందరు వ్యక్తులు క్షుద్రపూజలు చేస్తున్నట్టు స్థానికులు గుర్తించారు. ఆ పాత ఇంటిని ఇటీవలే రవితేజ అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. ఆ ఇంట్లో గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు చేస్తుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో భయపడిన ముఠా ముగ్గులను చెరిపేసి ఇంటికి తాళం వేసి పరారయ్యారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Tags:    

Similar News