క్షుద్రపూజల కలకలం : మంచం మీది మనిషి మాయం

దిశ, నర్సంపేట : ఓవైపు కరోనా కల్లోలం.. మరోవైపు క్షుద్రపూజల కలకలం. ఈ క్రమంలో వరంగల్ జిల్లా వాసులకు కంటిమీద కునుకు రావడం లేదు. రోజూ ఏదో ఓచోట క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. దీంతో జనం వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో క్షుద్రపూజలు కలకలం రేపింది. క్షుద్రపూజలతో ఓ వ్యక్తి మంచంలో నుంచి అదృశ్యం అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. వివరాల్లోకి వెళ్లితే.. ఉప్పటపల్లి గ్రామానికి చెందిన చీమల సతీష్ బుధవారం రాత్రి […]

Update: 2021-06-10 02:00 GMT

దిశ, నర్సంపేట : ఓవైపు కరోనా కల్లోలం.. మరోవైపు క్షుద్రపూజల కలకలం. ఈ క్రమంలో వరంగల్ జిల్లా వాసులకు కంటిమీద కునుకు రావడం లేదు. రోజూ ఏదో ఓచోట క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. దీంతో జనం వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో క్షుద్రపూజలు కలకలం రేపింది. క్షుద్రపూజలతో ఓ వ్యక్తి మంచంలో నుంచి అదృశ్యం అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. వివరాల్లోకి వెళ్లితే.. ఉప్పటపల్లి గ్రామానికి చెందిన చీమల సతీష్ బుధవారం రాత్రి ఆరుబయట నిద్రించాడు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు లేచి చూసేసరికి సతీష్ కనిపించ లేదు. మంచం మీద క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు, బొమ్మలు, మంచం చుట్టూ నిమ్మకాయలు ఉండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. సతీశ్‌ను మంత్రాలతో ఎవరో మాయం చేసారని కుటుంబ సభ్యులు ఏడుస్తూ ఉండటం గమనార్హం. సతీశ్ ఆచూకీ ఇంత వరకు తెలియారకపోవడంతో అనుమానాలు రెక్కెత్తిస్తోంది.

Tags:    

Similar News