ప్రెస్‌క్లబ్‌లో పొత్తూరి సంస్మరణ సభ
దిశ, హైదరాబాద్: జర్నలిజం వృత్తిలో ఉన్నత విలువలు కలిగిన సంపాదకులు పొత్తూరి వెంకటేశ్వర రావు అని సమాచార హక్కు చట్టం కమీషన్ సభ్యులు ప్రొ. మాడభూషి శ్రీధర్ అన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్, వయోధిక పాత్రికేయ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం పొత్తూరి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ.. అంతరిస్తున్న మంచి సంపాదకులలో పొత్తూరి ఒకరు అని అన్నారు. పాత్రికేయ రంగంలో ఆదర్శప్రాయుడు అని కొనియాడారు. తెలంగాణ ఏర్పాటు జరిగితేనే రెండు రాష్ట్రాల […]
దిశ, హైదరాబాద్: జర్నలిజం వృత్తిలో ఉన్నత విలువలు కలిగిన సంపాదకులు పొత్తూరి వెంకటేశ్వర రావు అని సమాచార హక్కు చట్టం కమీషన్ సభ్యులు ప్రొ. మాడభూషి శ్రీధర్ అన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్, వయోధిక పాత్రికేయ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం పొత్తూరి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ.. అంతరిస్తున్న మంచి సంపాదకులలో పొత్తూరి ఒకరు అని అన్నారు. పాత్రికేయ రంగంలో ఆదర్శప్రాయుడు అని కొనియాడారు. తెలంగాణ ఏర్పాటు జరిగితేనే రెండు రాష్ట్రాల ప్రజల మధ్య సయోధ్య ఉంటుందని అర్ధం చేసుకున్న మహనీయుడు పొత్తూరి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సంపాదకులు ఎస్.వినయ కుమార్, సీనియర్ జర్నలిస్ట్ నగేష్, కల్లూరి భాస్కరం, పొత్తూరి కుటుంబ సభ్యులు గోపాలకృష్ణ, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కార్యదర్శి విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పొత్తూరి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
tag: Obituary, potturi Venkateswara rao, press club, hyderabad