ఏపీలో తగ్గిన కరోనా కేసులు

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24గంటల్లో 44,935మందికి పరీక్షలు నిర్వహించగా 305మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,75,836కు చేరింది. ఇద్దరు చనిపోవడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 7,059గా ఉంది. ప్రస్తుతం 4,728 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8,64,049మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,08,75,925మందికి కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. అనంతపురం జిల్లాలో 8 కరోనా పాజిటివ్ […]

Update: 2020-12-14 06:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24గంటల్లో 44,935మందికి పరీక్షలు నిర్వహించగా 305మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,75,836కు చేరింది. ఇద్దరు చనిపోవడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 7,059గా ఉంది. ప్రస్తుతం 4,728 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8,64,049మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,08,75,925మందికి కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.

అనంతపురం జిల్లాలో 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా చిత్తూరులో 43, తూర్పుగోదావరిలో 28, గుంటూరులో 24, కడపలో 12, కృష్ణాలో 37, కర్నూలులో 12, నెల్లూరులో 27, ప్రకాశంలో 21, శ్రీకాకుళంలో 15, విశాఖపట్నంలో 19, విజయనగరంలో 14, పశ్చిమగోదావరిలో 45 కేసులు వచ్చాయి. కరోనా మహమ్మారి బారిన పడి నెల్లూరు జిల్లాలో ఇద్దరు చనిపోయినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.

Tags:    

Similar News