RRR అప్‌డేట్.. అక్కడ NTRకి డబ్బింగ్ ఎవరో తెలుసా..?

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు వేచి చూస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ ప్రధాన పాత్రలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే రాజమౌళి సినిమా ప్రమోషన్స్‌ను జోరుగా సాగిస్తున్నాడు. అదే విధంగా ప్రతి భాషలో సినిమాను సిద్దం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ‘ఆర్ఆర్ఆర్’ హిందీ వెర్షన్ డబ్బింగ్ ప్రారంభించారు. అయితే హిందీలో ఎన్‌టీఆర్‌కు డబ్బింగ్ ఎవరిస్తున్నారో తెలిస్తే మీకు మతులుపోతాయి. తెలుగులో కొమురం […]

Update: 2021-12-15 21:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు వేచి చూస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ ప్రధాన పాత్రలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే రాజమౌళి సినిమా ప్రమోషన్స్‌ను జోరుగా సాగిస్తున్నాడు. అదే విధంగా ప్రతి భాషలో సినిమాను సిద్దం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ‘ఆర్ఆర్ఆర్’ హిందీ వెర్షన్ డబ్బింగ్ ప్రారంభించారు. అయితే హిందీలో ఎన్‌టీఆర్‌కు డబ్బింగ్ ఎవరిస్తున్నారో తెలిస్తే మీకు మతులుపోతాయి. తెలుగులో కొమురం భీం పాత్రకు ఎన్‌టీఆర్ సరిగ్గా సరిపోయాడు. కేవలం లుక్స్‌లోనే కాదు. వాయిస్ సైతం సరిగ్గా సూట్ అయింది.

దీంతో ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్‌లో కొమురం భీం వాయిస్ ఎవరిస్తే బాగుంటుందని మూవీ టీమ్ ఆలోచనలో పడింది. ఇంతలో జక్కన్న అదిరిపోయే ఐడియా ఇచ్చాడు. ఎవరో ఎందుకు హిందీలోనూ తారక్ ఇస్తేనే సరిగ్గా ఉంటుందని జక్కన్న ప్లాన్ చేశాడు. అందుకు ఎన్‌టీఆర్ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వెంటనే ‘ఆర్ఆర్ఆర్’ హిందీ వెర్షన్‌లోనూ కొమురం భీం పాత్రకు ఎన్‌టీఆర్ స్వయంగా డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేసేశాడు.

Tags:    

Similar News