IED బ్లాస్ట్.. రంగంలోకి NSG బృందం
దిశ, వెబ్‌డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో గల ఇజ్రాయిల్ ఎంబసీకి వంద మీటర్ల దూరంలో శుక్రవారం రాత్రి భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోగా, ఐఈడీ బ్లాస్ట్‌గా ఢిల్లీ పోలీసులు గుర్తించారు. సీసీ టీవీ ఫుటేజీ పరిశీలన ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఓ ఆటోడ్రైవర్‌ను అదుపులోనికి తీసుకుని విచారించగా పేలుడుకు కారకులైన వారి గుర్తులను ఆయన వివరించారు. తొలుత ఈ ప్రదేశాన్ని NIA బృందం […]
దిశ, వెబ్‌డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో గల ఇజ్రాయిల్ ఎంబసీకి వంద మీటర్ల దూరంలో శుక్రవారం రాత్రి భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోగా, ఐఈడీ బ్లాస్ట్‌గా ఢిల్లీ పోలీసులు గుర్తించారు. సీసీ టీవీ ఫుటేజీ పరిశీలన ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఓ ఆటోడ్రైవర్‌ను అదుపులోనికి తీసుకుని విచారించగా పేలుడుకు కారకులైన వారి గుర్తులను ఆయన వివరించారు.
తొలుత ఈ ప్రదేశాన్ని NIA బృందం పరిశీలించి పలు వివరాలు సేకరించింది. అనంతరం NSG బృందం ఘటనా స్థలిని త్రీడీ మ్యాపింగ్ చేశారు. ఢిల్లీలో పేలుడుకు విదేశాల్లో కుట్ర జరిగిందని దర్యాప్తులో వెల్లడించింది. దాడికి ముందు ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం ముందు గుర్తు తెలియని వ్యక్తులు పలుమార్లు రెక్కీ నిర్వహించినట్లు ఎన్‌ఎస్‌జీ అధికారులు గుర్తించారు. పూర్తి దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు.