దాతృత్వం చాటుకున్న హుజూర్ నగర్ ఎన్నారై..

దిశ, హుజూర్ నగర్: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం వేపల సింగారం కు చెందిన సామల శంభమ్మ, సైదిరెడ్డిల కుమారుడు, సామల జైపాల్ రెడ్డి ప్రస్తుతం యూఎస్ లోని లాస్ ఏంజల్స్ లో ఉంటున్నారు. సింగారానికి ఇటీవల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం( సబ్ సెంటర్) మంజూరైంది. దీని నిర్మాణం అందరికీ అందుబాటులో ఉండాలని సర్పంచ్ అన్నెం శిరీషా కొండారెడ్డి ఆకాంక్షకు స్పందించిన ఎన్నారై జైపాల్ రెడ్డి దానికి స్థలం కొనివ్వడానికి దాతగా ముదుకు వచ్చారు. అందరికి […]

Update: 2021-11-14 00:15 GMT

దిశ, హుజూర్ నగర్: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం వేపల సింగారం కు చెందిన సామల శంభమ్మ, సైదిరెడ్డిల కుమారుడు, సామల జైపాల్ రెడ్డి ప్రస్తుతం యూఎస్ లోని లాస్ ఏంజల్స్ లో ఉంటున్నారు. సింగారానికి ఇటీవల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం( సబ్ సెంటర్) మంజూరైంది. దీని నిర్మాణం అందరికీ అందుబాటులో ఉండాలని సర్పంచ్ అన్నెం శిరీషా కొండారెడ్డి ఆకాంక్షకు స్పందించిన ఎన్నారై జైపాల్ రెడ్డి దానికి స్థలం కొనివ్వడానికి దాతగా ముదుకు వచ్చారు. అందరికి అందుబాటులో ఉండేలా, గ్రామంలోని రామాలయం స్టేజి పక్కన 5 గుంటల స్థలాన్ని సుమారు రూ.12 లక్షల తో కొనుగోలు చేసి గ్రామ పంచాయతీకి అప్పగించారు.

ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు శాశ్వతంగా ఉపయోగ పడే హెల్త్ సబ్ సెంటర్ కు సహాయం చేయడం సంతోషంగా ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో కనీస అవసరాలైన విద్యా, వైద్యం 100 శాతం అందుబాటులో రావాలని ఆంకాక్షను వ్యక్తం చేశారు. సొంత ఊరు, పుట్టిన భూమి కోసం సామల జైపాల్ రెడ్డి స్పందించడం అభినందనీయమని సర్పంచ్ అన్నెం శిరీష కొండారెడ్డి, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News