ఓడినా అతడే నెంబర్ వన్

దిశ, స్పోర్ట్స్: ఫ్రెంచ్ ఓపెన్‌లో ఓటమి పాలైనా నోవక్ జకోవిచ్ వరల్డ్ నెంబర్ 1 ర్యాంకును నిలబెట్టుకున్నాడు. 11740 పాయింట్లతో ఎవరికీ అందనంత దూరంలో ఉన్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ ముగియడంతో సోమవారం ఏటీపీ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. తన కెరీర్‌లో 13వ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచిన రఫెల్ నాదాల్ రెండో స్థానంలో ఉన్నాడు. 9850 పాయింట్లు కలిగిన రఫా జకోవిచ్ కంటే 1890 పాయింట్లు వెనుకబడి ఉన్నాడు. మూడో స్థానంలో డొమినిక్ థీమ్, నాలుగో స్థానంలో […]

Update: 2020-10-12 08:44 GMT

దిశ, స్పోర్ట్స్: ఫ్రెంచ్ ఓపెన్‌లో ఓటమి పాలైనా నోవక్ జకోవిచ్ వరల్డ్ నెంబర్ 1 ర్యాంకును నిలబెట్టుకున్నాడు. 11740 పాయింట్లతో ఎవరికీ అందనంత దూరంలో ఉన్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ ముగియడంతో సోమవారం ఏటీపీ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. తన కెరీర్‌లో 13వ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచిన రఫెల్ నాదాల్ రెండో స్థానంలో ఉన్నాడు.

9850 పాయింట్లు కలిగిన రఫా జకోవిచ్ కంటే 1890 పాయింట్లు వెనుకబడి ఉన్నాడు. మూడో స్థానంలో డొమినిక్ థీమ్, నాలుగో స్థానంలో రోజర్ ఫెదరర్ ఉన్నాడు. ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత ఇప్పటివరకు ఫెదరర్ ఏ టోర్నీలో ఆడకపోవడం గమనార్హం. ఈసారి ర్యాంకింగ్‌లో అతిపెద్ద మార్పు అర్జెంటీనాకు చెందిన స్క్వాట్జ్‌మెన్‌దే. ఫ్రెంచ్ ఓపెన్ సెమీ ఫైనల్స్ చేరుకున్న అతను ఆరు స్థానాలను మెరుగుపరుచుకుని ఎనిమిదో ర్యాంకులో ఉన్నాడు.

మహిళల ర్యాంకింగ్స్‌లో ఆష్లీ బార్టీ అగ్రస్థానంలో కొనసాగుతున్నది. రెండో స్థానంలో సిమోనా హలెప్, మూడో స్థానంలో నవొమి ఒసాకా, నాలుగో స్థానంలో కెనిన్ ఉన్నారు. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా నిలిచిన పోలెండ్ క్రీడాకారిణి స్వైటెక్ తన కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకుకు చేరుకున్నది. 37 స్థానాలను మెరుగుపరుచుకున్న ఆమె 17వ ర్యాంకులో కొనసాగుతున్నది.

Tags:    

Similar News