సబ్సిడీపై ఆసు యంత్రాలు
దిశ హుజూనగర్: చేనేత ఆసు యంత్రాలను సబ్సిడీ ద్వారా పొందడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. 18 ఏళ్లు నిండి, జియో ట్యాగింగ్ చేనేత మగ్గం కలిగిన మహిళలు ఆసు యంత్రం కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఫెడరేషన్ ఆఫ్ హ్యాండ్ లూమ్ స్కీం కింద వెయ్యి ఆసు యంత్రాలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఈ మార్గదర్శకాలను పరిశ్రమలు, వాణిజ్య శాఖ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ కార్యదర్శి పేరు మీద విడుదల అయ్యాయి. ఒక ఆసు యంత్రం ఖరీదు రూ. […]
దిశ హుజూనగర్: చేనేత ఆసు యంత్రాలను సబ్సిడీ ద్వారా పొందడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. 18 ఏళ్లు నిండి, జియో ట్యాగింగ్ చేనేత మగ్గం కలిగిన మహిళలు ఆసు యంత్రం కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఫెడరేషన్ ఆఫ్ హ్యాండ్ లూమ్ స్కీం కింద వెయ్యి ఆసు యంత్రాలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఈ మార్గదర్శకాలను పరిశ్రమలు, వాణిజ్య శాఖ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ కార్యదర్శి పేరు మీద విడుదల అయ్యాయి. ఒక ఆసు యంత్రం ఖరీదు రూ. 27,000 కాగా, సంస్థ 50 శాతం, ప్రభుత్వం 25 శాతం సబ్సిడీ భరించనుంది. దీంతో లబ్ధిదారులు కేవలం రూ. 6,750 చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల 31 లోపు జిల్లా సహాయ సంచాలకులు, చేనేత జౌళి శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.