రైల్వేలో కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దిశ, తెలంగాణ బ్యూరో : రైల్వే శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిన వైద్యులను భర్తీ చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్ డివిజన్ పరిధిలోని పలు హాస్పిటళ్లలో కరోనా టెస్టులు, వ్యాక్సినేషన్ చేపట్టేందుకు, కొవిడ్ బారిన పడి చికిత్స పొందుతున్న వారికి వైద్యం అందించేందుకు వైద్యులను నియమిస్తున్నట్లు శాఖ పేర్కొంది. డాక్టర్లకు ఆరు నెలలు, పారా మెడికల్ సిబ్బందికి మూడు నెలల కాంట్రాక్ట్ పద్ధతిన తీసుకుంటామని, ఇందుకు ఆన్ లైన్ ద్వారా ఇంటర్వ్యూలు చేపడుతున్నట్లు […]
దిశ, తెలంగాణ బ్యూరో : రైల్వే శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిన వైద్యులను భర్తీ చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్ డివిజన్ పరిధిలోని పలు హాస్పిటళ్లలో కరోనా టెస్టులు, వ్యాక్సినేషన్ చేపట్టేందుకు, కొవిడ్ బారిన పడి చికిత్స పొందుతున్న వారికి వైద్యం అందించేందుకు వైద్యులను నియమిస్తున్నట్లు శాఖ పేర్కొంది. డాక్టర్లకు ఆరు నెలలు, పారా మెడికల్ సిబ్బందికి మూడు నెలల కాంట్రాక్ట్ పద్ధతిన తీసుకుంటామని, ఇందుకు ఆన్ లైన్ ద్వారా ఇంటర్వ్యూలు చేపడుతున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది. ఇందుకు రిటైర్డ్ రైల్వే డాక్టర్లు, ఇతరులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ముగ్గురు(అనస్థీషియా, ఫిజీషియన్, పల్మనాలజిస్ట్) స్పెషల్ డాక్టర్లు, 16 జీడీఎంవో పోస్టులు, 31 నర్సింగ్, 26 హాస్పిటల్ అటెండెంట్లు, ఇద్దరు ఫార్మాసిస్ట్ లు, ఒక హెల్త్ ఇన్ స్పెక్టర్, ఒక ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు రైల్వే శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. స్పెషల్ డాక్టర్లు, జీడీఎంవో లకు 53 ఏండ్లకు మించి ఉండరాదని తెలిపింది. నర్సింగ్, ఫార్మాసిస్ట్, హెల్త్ ఇన్ స్పెక్టర్లు 20 నుంచి 33 ఏండ్లలోపు ఉన్నవారు అర్హులని పేర్కొంది.హాస్పిటల్ అటెండెంట్లు 18 నుంచి 33 ఏండ్లలోపు ఉండాలని తెలిపింది.
అర్హులైన వారు పదో తరగతి సర్టిఫికెట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్ ను జతచేసి contractmedicalhyb@gmail.com మెయిల్ ఐడీకి ఈనెల 29వ తేదీలోపు పంపాలని రైల్వేశాఖ పేర్కొంది. దరఖాస్తులను పరిశీలించి జూన్ 4, 5 తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని రైల్వే శాఖ స్పష్టం చేసింది.