Neha Byadwal : మూడేండ్లు అస్సలు ముట్టుకునేది లేదంటూ.. ఈ యంగెస్ట్ డైనమిక్ ఆఫీసర్ ఏం చేశారంటే..

Neha Byadwal : మూడేండ్లు అస్సలు ముట్టుకునేది లేదంటూ.. ఈ యంగెస్ట్ డైనమిక్ ఆఫీసర్ ఏం చేశారంటే..

Update: 2025-03-30 06:07 GMT
Neha Byadwal : మూడేండ్లు అస్సలు ముట్టుకునేది లేదంటూ.. ఈ యంగెస్ట్ డైనమిక్ ఆఫీసర్ ఏం చేశారంటే..
  • whatsapp icon

దిశ, ఫీచర్స్ :  మీకు ఈ  విషయం తెలుసా? ఆ మధ్య సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచిన ఓ అందమైన యువతి నెటిజన్లను తెగ ఆకట్టుకుంది. ఆమె చిరు మందహాసం, చురుకైన చూపులు, హుందాతనం చూసి యూత్ అంతా ఫిదా అయిపోయింది. అనేకమంది ఆమెను ప్రశంసలతో, పాజిటివ్ కామెంట్లతో ముంచెత్తారు. ఇంతకీ సంగతేంది! అని డౌట్ పడుతున్నారా? ఇక్కడే ఓ విశేషముంది. ఆమె ఎవరో కాదు, ఇండియాలోనే యంగెస్ట్ డైనమిక్ అండ్ బ్యూటిఫుల్ ఫిమేల్ ఐఏఎస్‌ ఆఫీసర్ (Female IAS officer). పేరు నేహా బ్యాద్వాల్ (Neha Byadwal). ప్రస్తుతం చాలామంది నెటిజన్లు ఆమె గురించి చర్చించుకుంటున్నారు. కారణం ఏంటో తెలుసా?

ఇండియాలోనే చిన్న వయసు గల మహిళా ఐఏఎస్‌‌లలో నేహా బ్యాద్వాల్ ఒకరు. 1999, జులై 3న రాజస్థాన్‌లోని జైపూర్‌లో జన్మించిన ఆమె, ఛత్తీస్‌గఢ్‌లో పుట్టి పెరిగారు. ఇక్కడే డీపీఎస్ కోర్బా (DPS Korba) అండ్ డీపీఎస్ బిలాస్‌పూర్ (DPS Bilaspur) పాఠశాలల్లో స్టడీ పూర్తి చేశారు. ఆమె తన తండ్రి శ్రవణ్ కుమార్ ఒక సీనియర్ ఇన్‌కం‌టాక్స్ ఆఫీసర్. ఆయన స్ఫూర్తితో, ప్రేరణతో గొప్పగా చదువుకొని దేశసేవ చేయాలని చిన్నప్పటి నుంచి భావించేదట. అయితే రాయ్‌పూర్‌లోని DB గర్ల్స్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నేహా అక్కడే యూనివర్సిటీ టాపర్‌గా నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించింది.

ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా యూపీఎస్సీ పరీక్షలు రాసిన నేహా బ్యాద్వాల్ తన మొదటి ప్రయత్నంలో మాత్రం విఫలమైంది. కానీ వెనుకడుగు వేయలేదు. అందుకు గల కారణాలను విశ్లేషించుకుంది. కాగా సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ వాడకం కూడా ఒక రీజన్ అని గుర్తించిన ఆమె, ఆ తర్వాత లక్ష్యం సాధించే వరకూ ఫోన్ ముట్టకూడదని డిసైడ్ అయ్యిందట. ఆ తర్వాత మూడేండ్లపాటు ఒక్కసారి కూడా వాటిజోలికి పోకుండా ప్రిపేర్ అయింది. ఈ విధమైన పట్టుదల స్వీయ నియంత్రణ ప్రదర్శించడమే ఆమె సోషల్ మీడియా ట్రెండింగ్‌లో నిలువడానికి కారణమైంది.

నేడు ఎంతోమంది సమయాన్ని, ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తూ.. ఒత్తిడికి గురిచేస్తున్న వాటిలో మొబైల్ ఫోన్, సోషల్ మీడియా కూడా ఒకటని అంటారు. అయితే మూడేండ్లపాటు వీటిని పక్కన పెట్టిన నేహా బ్యాద్వాల్, 2021లో యూపీఎస్సీ (UPSC) పరీక్షలో 569వ ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) సాధించింది. అప్పటికి ఆమె వయసు 22 సంవత్సరాలు. ఈ సక్సెస్ జర్నీలో ఆమె కృష్టి, పట్టుదలతోపాటు మూడేండ్లు ఫోన్ వాడకుండా, సోషల్ మీడియాకు దూరంగా ఉండటం అనేది అనేకమందిని ఆకట్టుకున్న విషయం. దీంతో ఆమె లైఫ్‌స్టైల్ తమకు స్ఫూర్తినిచ్చిందని నెటిజన్లు, యువతీ యువకులు అంటున్నారు. యంగెస్ట్ ఉమన్ ఐఏఎస్‌గానే కాకుండా అందమైన మహిళగా, క్రమశిక్షణ గల ఆఫీసర్‌గా ప్రశంసలు అందుకుంటున్నది. 

Full View

Tags:    

Similar News