Inter Results-2025: ఇంటర్ ఫలితాలపై కీలక అప్డేట్.. ఆ తేదీల్లో విడుదలయ్యే ఛాన్స్!?
రాష్ట్రం(Andhra Pradesh)లో ఇంటర్మీడియట్ పరీక్షలు(Intermediate exams) ప్రశాంతంగా ముగిశాయి.
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రం(Andhra Pradesh)లో ఇంటర్మీడియట్ పరీక్షలు(Intermediate exams) ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఏడాది మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు దాదాపు 10 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలు ముగిసిన నేపథ్యంలో జవాబు పత్రాల మూల్యాంకనం కూడా విద్యాశాఖ(Education Department) అధికారులు ప్రారంభించారు. ఇదిలా ఉంటే పరీక్ష అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు, లెక్చరర్స్ పరీక్ష ఫలితాలు(Results) ఎప్పుడు విడుదల అవుతాయి అనే ఆసక్తితో ఎదురు చూస్తుంటారు.
ఈ క్రమంలో రాష్ట్ర విద్యాశాఖ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను ఈ నెల(ఏప్రిల్) 12-15వ తేదీల మధ్య విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం కాగా ఈ నెల 6వ తేదీన ముగియనుంది. ఆ తర్వాత వాటిని కంప్యూటర్‌లో నమోదు చేయడానికి వారం రోజులు పడుతుందని అంచనా. ఇక ఆ తర్వాతే ఫలితాలు రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. అయితే ఎప్పుడైన ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచేవారు. కానీ ఇప్పుడు వాట్సప్‌లో విడుదల చేయనున్నట్లు సమాచారం. విద్యార్థులు వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా లేదా BIEAP అధికారిక వెబ్‌సైట్ https://bie.ap.gov.in/ ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది.