‘ఐపీఎల్ కంటే వాళ్లే ఎక్కువ’

దిశ, స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 13వ సీజన్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు కీలక బ్యాట్స్‌మాన్ సురేష్ రైనా ప్రకటించడం ప్రకంపనలు సృష్టిస్తున్నది. వ్యక్తిగత కారణాలతో రైనా ఈ సీజన్ ఆడలేకపోతున్నాడని సీఎస్కే (CSK) యాజమాన్యం ప్రకటించింది. జాతీయ మీడియా అతని మేనత్త కుటుంబంలో జరిగిన దుర్ఘటన కారణంగా ఇండియా వచ్చేసినట్లు చెబుతుండగా, రైనా సన్నిహితులు మాత్రం కారణం వేరే ఉన్నదని అంటున్నారు. యూఏఈ నుంచి ఢిల్లీ చేరుకున్న […]

Update: 2020-08-30 10:30 GMT

దిశ, స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 13వ సీజన్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు కీలక బ్యాట్స్‌మాన్ సురేష్ రైనా ప్రకటించడం ప్రకంపనలు సృష్టిస్తున్నది. వ్యక్తిగత కారణాలతో రైనా ఈ సీజన్ ఆడలేకపోతున్నాడని సీఎస్కే (CSK) యాజమాన్యం ప్రకటించింది. జాతీయ మీడియా అతని మేనత్త కుటుంబంలో జరిగిన దుర్ఘటన కారణంగా ఇండియా వచ్చేసినట్లు చెబుతుండగా, రైనా సన్నిహితులు మాత్రం కారణం వేరే ఉన్నదని అంటున్నారు.

యూఏఈ నుంచి ఢిల్లీ చేరుకున్న రైనా తన ఇంటిలో ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నాడు. ‘పిల్లల కంటే తనకు ఏదీ ముఖ్యం కాదు’ అని రైనా సన్నిహితుల వద్ద చెప్పినట్లు జాగరణ్ పత్రిక పేర్కొంది. రైనాకు కూతురు గ్రేసియా, కొడుకు రియో ఉన్నారు. వీరి కోసం కొంత కాలం క్రికెట్‌కు కూడా దూరమయ్యాడు. ఇప్పుడు జట్టులో ఒకే సారి 13 మంది కరోనా బారిన పడటంతో కుటుంబం పట్ల ఆందోళన చెందిన రైనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. మేనత్త ఇంటిలో దుర్ఘటన అగస్టు 19న జరిగింది. ఆ సమయంలో చెన్నైలోనే ఉన్న రైనా.. పఠాన్‌కోట్ వెళ్లలేదు. కానీ యూఏఈ వెళ్లిన తర్వాతే కరోనా కారణంగా తిరిగి వచ్చేశాడని అంటున్నారు.

Tags:    

Similar News