దూబే ఎన్‌కౌంటర్‌ను ‘దిశ’తో పోల్చొద్దు

న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్ నకిలీ కాదని, చట్టం, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే రాష్ట్రప్రభుత్వం నడుచుకుందని ఉత్తరప్రదేశ్ పోలీసులు సర్వోన్నత న్యాయస్థానానికి వివరించారు. తెలంగాణ ఎన్‌కౌంటర్‌తో ఈ కేసును పోల్చి చూడొద్దని, అక్కడ బాధితులు సామాన్యులైతే ఇక్కడ కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ అని తెలిపారు. కాగా, తెలంగాణ ఘటనపై విచారణకు మెజిస్ట్రేట్ దర్యాప్తు లేదా జ్యుడిషియల్ కమిషన్‌కు ఆదేశించలేదని, కానీ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిందని, అలాగే దర్యాప్తుకు ప్రత్యేకంగా కమిషన్ నియమించిందని యూపీ డీజీపీ […]

Update: 2020-07-17 06:31 GMT

న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్ నకిలీ కాదని, చట్టం, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే రాష్ట్రప్రభుత్వం నడుచుకుందని ఉత్తరప్రదేశ్ పోలీసులు సర్వోన్నత న్యాయస్థానానికి వివరించారు. తెలంగాణ ఎన్‌కౌంటర్‌తో ఈ కేసును పోల్చి చూడొద్దని, అక్కడ బాధితులు సామాన్యులైతే ఇక్కడ కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ అని తెలిపారు. కాగా, తెలంగాణ ఘటనపై విచారణకు మెజిస్ట్రేట్ దర్యాప్తు లేదా జ్యుడిషియల్ కమిషన్‌కు ఆదేశించలేదని, కానీ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిందని, అలాగే దర్యాప్తుకు ప్రత్యేకంగా కమిషన్ నియమించిందని యూపీ డీజీపీ అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

భద్రతా కారణాల వల్ల వికాస్ దూబేను ఆ రోజు కారు మార్చామని, కాన్వాయ్‌లో 15 మంది పోలీసు సిబ్బంది ఉన్నారని, అందుకే అతనికి బేడీలు వేయలేదని వివరించారు. ఆ దారిలో మీడియా వాహనాలను ఆపలేదని, అలాగే, ఘటనాస్థలిలో వాహనం జారిపడిన అచ్చులున్నాయని తెలిపారు. పోలీసులు చట్టబద్ధంగా నడుచుకున్నారని, సమయమిస్తే మరిన్ని ఆధారాలు సమర్పిస్తామని తెలిపారు. సుమారు 60 కేసులున్న గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేను మధ్యప్రదేశ్‌లో అరెస్టు చేసి కాన్పూర్ తరలిస్తుండగా కారు బోల్తా కొట్టిన తర్వాత పోలీసు తుపాకీ లాక్కుని కాల్పులకు దిగగా ఎదురుకాల్పులకు దిగామని, ఈ కాల్పుల్లో జులై 10న వికాస్ హతమయ్యాడని యూపీ పోలీసులు తెలిపారు. కాగా, దిశ హత్యాచారం కేసులోని నలుగురు నిందితులు తెలంగాణలో ఎన్‌కౌంటర్‌లో హతమైన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News