స్పేస్‌లో ‘రష్యన్ సినిమా’ షూటింగ్

దిశ, వెబ్‌డెస్క్ : ఇప్పటి వరకు మూవీ మేకర్స్ తమ సినిమాల షూటింగ్ నిమిత్తం.. కొండ కోనల నుంచి సాగర గర్భం వరకు ఏ ప్రదేశాన్నీ వదలలేదు. ఇక ఆ జాబితాలో ‘స్పేస్‘ ఒక్కటే మిగిలి పోయింది. అయితే, అమెరికన్‌ స్పేస్‌ ఏజెన్సీ ‘నాసా’తో కలిసి హాలీవుడ్‌ నటుడు టామ్‌ క్రూయిజ్‌ చేస్తున్న ఓ సినిమా కోసం స్పేస్‌ స్టేషన్‌లో చిత్రీకరణ చేయనున్నట్లు ఇటీవలే ఓ ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. యాక్షన్‌ అడ్వెంచర్‌గా రూపొందనున్న ఈ […]

Update: 2020-11-08 06:51 GMT

దిశ, వెబ్‌డెస్క్ :
ఇప్పటి వరకు మూవీ మేకర్స్ తమ సినిమాల షూటింగ్ నిమిత్తం.. కొండ కోనల నుంచి సాగర గర్భం వరకు ఏ ప్రదేశాన్నీ వదలలేదు. ఇక ఆ జాబితాలో ‘స్పేస్‘ ఒక్కటే మిగిలి పోయింది. అయితే, అమెరికన్‌ స్పేస్‌ ఏజెన్సీ ‘నాసా’తో కలిసి హాలీవుడ్‌ నటుడు టామ్‌ క్రూయిజ్‌ చేస్తున్న ఓ సినిమా కోసం స్పేస్‌ స్టేషన్‌లో చిత్రీకరణ చేయనున్నట్లు ఇటీవలే ఓ ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. యాక్షన్‌ అడ్వెంచర్‌గా రూపొందనున్న ఈ సినిమాకు ఎలాన్‌ మస్క్‌కు చెందిన ‘స్పేస్‌ ఎక్స్‌’ కంపెనీ సహాయ సహకారాలు అందించనుంది. కాగా వీరి బాటలోనే మరో రష్యన్ చిత్ర బృందం సైతం ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌లో సినిమా షూటింగ్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది.

రష్యన్ చానల్ వన్‌కు సంబంధించిన స్పేస్ ఏజెన్సీ ‘రాస్‌కాస్మస్’, ప్రొడక్షన్ కంపెనీ ఎల్లో, బ్లాక్ అండ్ వైట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న రష్యన్ సినిమా ‘ వైజోవ్ (లిటిల్ చాలెంజ్)’ను స్పేస్‌లో చిత్రీకరిస్తున్నట్లు రాస్‌కాస్మస్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. క్లిమ్ షిపెంకో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ 2021 అక్టోబర్‌లో ప్రారంభమవుతుందని వెల్లడించింది. ప్రస్తుతానికి ‘వైజోవ్’ వర్కింగ్ టైటిల్ మాత్రమే కాగా, ఒరిజినల్ టైటిల్ నిర్ణయించాల్సి ఉంది. అయితే షూటింగ్‌లో భాగంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు ఫిమేల్ క్యారెక్టర్‌ను పంపించే యోచనలో చిత్ర బృందం.. ప్రస్తుతం ఆ ఫిమేల్ యాక్టర్ కోసం సెర్చ్ చేస్తోంది. రష్యా స్పేస్ యాక్టివిటీస్ పాపులరైజ్ చేయడమే ధ్యేయంగా ఈ సినిమా రూపొందుతుండటం విశేషం.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..