2020లో ఆక్స్‌ఫర్డ్ టీకా ఖచ్చితంగా వస్తుందని చెప్పలేం..

లండన్ : కరోనా నివారణకు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న టీకా ఈ ఏడాదిలో వచ్చే అవకాశముందని, కానీ ఖచ్చితంగా వస్తుందని చెప్పలేమని పరిశోధకులు మంగళవారం తెలిపారు. తొలిదశ క్లినికల్ ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలనిచ్చిన ఈ టీకా పై ప్రపంచమంతా ఆశలు పెట్టుకున్నది. సెప్టెంబర్‌కల్లా కనీసం 10లక్షల డోసులు అందుబాటులోకి తేవాలని యూనివర్సిటీ గతంలో నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్ తీసుకురావాలన్నదే తమ టార్గెట్ కానీ, ఈ లక్ష్యం మూడు విషయాలపై ఆధారపడి […]

Update: 2020-07-21 05:54 GMT

లండన్ : కరోనా నివారణకు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న టీకా ఈ ఏడాదిలో వచ్చే అవకాశముందని, కానీ ఖచ్చితంగా వస్తుందని చెప్పలేమని పరిశోధకులు మంగళవారం తెలిపారు. తొలిదశ క్లినికల్ ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలనిచ్చిన ఈ టీకా పై ప్రపంచమంతా ఆశలు పెట్టుకున్నది. సెప్టెంబర్‌కల్లా కనీసం 10లక్షల డోసులు అందుబాటులోకి తేవాలని యూనివర్సిటీ గతంలో నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే.
ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్ తీసుకురావాలన్నదే తమ టార్గెట్ కానీ, ఈ లక్ష్యం మూడు విషయాలపై ఆధారపడి ఉన్నదని పరిశోధకురాలు సారా గిల్బర్ట్ బీబీసీ రేడియోకు తెలిపారు. క్లినికల్ తుది దశ ట్రయల్స్‌లోనూ మంచి ఫలితాలు చూపెట్టాలని, పెద్ద మొత్తంలో పార్టిసిపెంట్లపై ప్రయోగించనుండటంతో ఆ స్థాయిలో డోసుల అవసరమూ ఉంటుందని వివరించారు.
ఎమర్జెన్సీ సమయంలో వినియోగించడానికి రెగ్యూలేటర్లు తక్షణమే అనుమతివ్వడం మూడో సవాల్ అని తెలిపారు. ఈ మూడు సకాలంలో జరిగితే ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందిని పేర్కొన్నారు. యూకేలో వైరస్ తగ్గుముఖం పట్టడం కూడా ప్రయోగాలకు సవాలుగా మారింది. అందుకే బ్రెజిల్, దక్షిణాఫ్రికా, అమెరికాల్లో ప్రయోగాలు చేస్తున్నదని ఆక్స్‌ఫర్డ్ మెడికల్ ప్రొఫెసర్ జాన్‌బెల్ తెలిపారు.

Tags:    

Similar News