వైరల్: బికినీ వేసుకోలేదని భారీ జరిమానా
దిశ, స్పోర్ట్స్: నార్వే మహిళల హ్యాండ్ బాల్ జట్టు బికినీలు ధరించకుండా నిబంధనలకు విరుద్దంగా షార్ట్స్ వేసుకోవడంతో భారీ జరిమానా విధించారు. రూల్స్‌కు వ్యతిరేకంగా మ్యాచ్ ఆడినందుకు గాను ఆటగాళ్లు అందరికీ యూరోపియన్ హ్యాండ్ బాల్ ఫెడరేషన్ (ఈహెచ్ఎఫ్) ప్రకటించింది. జట్టు మొత్తానికి 1500 యూరోలు (రూ. 1,31,700) జరిమానా విధించగా ఒక్కొక్కరు 150 యూరోలు చెల్లించాల్సి ఉంటుంది. బల్గేరియాలోని వర్నాలో ఇటీవల యూరోపియన్ బీచ్ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్ జరిగింది. స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో నార్వే జట్టు […]
దిశ, స్పోర్ట్స్: నార్వే మహిళల హ్యాండ్ బాల్ జట్టు బికినీలు ధరించకుండా నిబంధనలకు విరుద్దంగా షార్ట్స్ వేసుకోవడంతో భారీ జరిమానా విధించారు. రూల్స్‌కు వ్యతిరేకంగా మ్యాచ్ ఆడినందుకు గాను ఆటగాళ్లు అందరికీ యూరోపియన్ హ్యాండ్ బాల్ ఫెడరేషన్ (ఈహెచ్ఎఫ్) ప్రకటించింది. జట్టు మొత్తానికి 1500 యూరోలు (రూ. 1,31,700) జరిమానా విధించగా ఒక్కొక్కరు 150 యూరోలు చెల్లించాల్సి ఉంటుంది. బల్గేరియాలోని వర్నాలో ఇటీవల యూరోపియన్ బీచ్ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్ జరిగింది.
స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో నార్వే జట్టు బికినీల స్థానంలో షార్ట్స్ వేసుకొని బరిలోకి దిగారు. కాగా, ఈ వివాదాస్పద నిబంధనను వెనక్కు తీసుకోవాలంటూ గత కొంత కాలంగా ఆటగాళ్లు కోరుతున్నారు. వివాదాస్పద నిర్ణయానికి వ్యతిరేకంగా నార్వే ఆటగాళ్లు నిరసన తెలపడానికే షార్ట్స్‌తో బరిలోకి దిగారని నార్వే హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ ప్రకటించింది. ఆటగాళ్లకు విధించిన జరిమానాను తామే చెల్లిస్తామని కూడా స్పష్టం చేసింది.