కుదుటపడుతోన్న ఢిల్లీ

న్యూఢిల్లీ : నాలుగు రోజులు రణరంగాన్ని తలపించిన నార్త్ ఢిల్లీ ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. సామాన్యులు బయటికొస్తున్నారు. కొన్ని దుకాణాలు తెరుచుకున్నాయి. రోడ్లపై నుంచి ఇటుకలు, రాళ్లు, చెత్తను తొలగిస్తున్నారు. అయితే, ఇప్పటికీ పెద్దమొత్తంలో జనాలు గుమిగూడటంపై నిషేధం ఉంది. త్వరలోనే సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని అధికారులు తెలిపారు. ఈ అల్లర్లకు సంబంధించి మొత్తం 148 ఎఫ్ఐఆర్‌లు నమోదవ్వగా.. సుమారు 630 మందిని పోలీసులు అరెస్టు లేదా అదుపులోకి తీసుకున్నారు. సీఏఏ ఆందోళనలు అల్లర్లుగా పరిణమించిన విషయం తెలిసిందే. […]

Update: 2020-02-29 01:44 GMT

న్యూఢిల్లీ : నాలుగు రోజులు రణరంగాన్ని తలపించిన నార్త్ ఢిల్లీ ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. సామాన్యులు బయటికొస్తున్నారు. కొన్ని దుకాణాలు తెరుచుకున్నాయి. రోడ్లపై నుంచి ఇటుకలు, రాళ్లు, చెత్తను తొలగిస్తున్నారు. అయితే, ఇప్పటికీ పెద్దమొత్తంలో జనాలు గుమిగూడటంపై నిషేధం ఉంది. త్వరలోనే సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని అధికారులు తెలిపారు. ఈ అల్లర్లకు సంబంధించి మొత్తం 148 ఎఫ్ఐఆర్‌లు నమోదవ్వగా.. సుమారు 630 మందిని పోలీసులు అరెస్టు లేదా అదుపులోకి తీసుకున్నారు. సీఏఏ ఆందోళనలు అల్లర్లుగా పరిణమించిన విషయం తెలిసిందే. ఈ హింసాత్మక ఘటనల్లో 42 మంది మరణించగా.. వందలమంది గాయాలపాలయ్యారు. ఈ అల్లర్లపై విచారణను ఢిల్లీ పోలీసులు.. క్రైం బ్రాంచ్‌కు బదిలీ చేశారు.

Tags:    

Similar News