యూకేలో మరో కొత్త వైరస్! వర్షాకాలంలో మరింత వ్యాప్తి చెందే అవకాశం

దిశ, ఫీచర్స్ : వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతున్నా, కరోనా వైరస్ విషయంలో ఇప్పటికీ అజాగ్రత్త తగదని వైద్యులు సూచిస్తున్నారు. రెండు డోసులు తీసుకున్నా, మూడోది కూడా తీసుకోవాల్సిన అవసరముందని నిపుణులు చెబుతున్నారు. డెల్టా వేరియంట్ విషయంలో ప్రస్తుత వ్యాక్సిన్స్ అంతగా పనిచేయడం లేదని వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ కరోనా కోరల్లో ఉన్న ప్రజలకు యూకేలో మరో కొత్త వైరస్ కేసులు కలవరపెడుతున్నాయి. పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ (పిహెచ్‌ఇ) ప్రకారం న్యూ వైరస్‌ను ‘నోరో’గా పిలుస్తుండగా, వాటి కేసులు […]

Update: 2021-07-29 04:14 GMT

దిశ, ఫీచర్స్ : వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతున్నా, కరోనా వైరస్ విషయంలో ఇప్పటికీ అజాగ్రత్త తగదని వైద్యులు సూచిస్తున్నారు. రెండు డోసులు తీసుకున్నా, మూడోది కూడా తీసుకోవాల్సిన అవసరముందని నిపుణులు చెబుతున్నారు. డెల్టా వేరియంట్ విషయంలో ప్రస్తుత వ్యాక్సిన్స్ అంతగా పనిచేయడం లేదని వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ కరోనా కోరల్లో ఉన్న ప్రజలకు యూకేలో మరో కొత్త వైరస్ కేసులు కలవరపెడుతున్నాయి. పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ (పిహెచ్‌ఇ) ప్రకారం న్యూ వైరస్‌ను ‘నోరో’గా పిలుస్తుండగా, వాటి కేసులు 154గా నమోదయ్యాయి. నోరో ఎలా వ్యాపిస్తుంది, దాని కారణాలు, లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం.

నోరో వైరస్ అంటువ్యాధి కాగా, ఇది వికారం, వాంతులు, విరేచనాలకు కారణమవుతుంది. ఇది నోటి మార్గం ద్వారానే సోకే అవకాశముంది. అంటే కలుషితమైన ఆహారం, నీరుతో పాటు, ఆహారం తీసుకునే సమయంలో శుభ్రత పాటించకపోవడం వల్ల ఇది సంక్రమించొచ్చు. ఇది ఉపరితలాలపై కూడా ఉంటుందని, చేతులను పరిశుభ్రంగా కడుక్కుని మాత్రమే ఆహారం స్వీకరించకపోతే వేగంగా సోకుతుందని వైద్య నిపుణులు సూచించారు. ఈ వైరస్ ప్రధానంగా వర్షాకాలంలో ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే నీటి నాణ్యత తగ్గిపోతోంది, సూక్ష్మక్రిములు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా, నోరోవైరస్ బారిన పడిన ఎవరైనా వంట చేస్తుంటే, వారి ద్వారా ఇతరులకు త్వరగా సోకే అవకాశం ఉంది.

ఎలా నివారించొచ్చు ?

వైరల్ గ్యాస్ట్రోఎంటెరిటిస్ ఐదు- ఆరు రోజుల వరకు లేదా మరిన్ని ఎక్కువ రోజులు ఉండవచ్చు. దీన్ని నయం చేయడానికి యాంటీబయాటిక్స్ ఉపయోగపడవు. పరిశుభ్రత ప్రమాణాలను పాటించడం ద్వారా సంక్రమణను నివారించొచ్చు. డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. గోరువెచ్చని నీళ్లను తాగడంతో పాటు, ఆహారం కూడా వేడి వేడిగా స్వీకరించాలి. ఔట్‌సైడ్ ఫుడ్ తినకపోవడం ఉత్తమం.

కరోనా, నోరోకు తేడా?

కొవిడ్ గాలి ద్వారా వ్యాపిస్తుండగా, నోరోవైరస్ ఒరోఫెకల్ ద్వారా సోకుతుంది. మనం ఆహారం లేదా నీళ్లను స్వీకరించినప్పుడు మాత్రమే వైరస్ శరీరం లోపలికి వస్తుంది. రెండు సందర్భాల్లో చేతి పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యమైనది అయితే రూట్ ఆఫ్ ట్రాన్స్‌మిషన్ మాత్రం వేరు.

Tags:    

Similar News