ఉత్తరాఖండ్‌లో వింత బ్యానర్లు.. నాన్ హిందువులకు నో ఎంట్రీ..!
దిశ, వెబ్‌డెస్క్ : బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరాఖండ్ డెహ్రడూన్‌లో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. హిందూ ఆలయాలలోనికి ఇతర మతస్తులు ప్రవేశించరాదని సుమారు 150 నుంచి 200 టెంపుల్ పరిసరాల్లో బ్యానర్లు వెలిశాయి. దీనిపై పలు ఫిర్యాదులు వెల్లువెత్తడంతోబ్యానర్లు ఏర్పాటు చేసిన హిందూ వాహిని సంస్థపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అంతకుముందు ఉత్తర ప్రదేశ్‌లోని ఓ ఆలయంలోని ట్యాప్ వాటర్ తాగినందుకు ఓ ముస్లిం యువకుడిపై దాడి చేసినట్లు అందులో పేర్కొన్నారు. పోలీసుల రంగ ప్రవేశం […]
దిశ, వెబ్‌డెస్క్ : బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరాఖండ్ డెహ్రడూన్‌లో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. హిందూ ఆలయాలలోనికి ఇతర మతస్తులు ప్రవేశించరాదని సుమారు 150 నుంచి 200 టెంపుల్ పరిసరాల్లో బ్యానర్లు వెలిశాయి. దీనిపై పలు ఫిర్యాదులు వెల్లువెత్తడంతోబ్యానర్లు ఏర్పాటు చేసిన హిందూ వాహిని సంస్థపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
అంతకుముందు ఉత్తర ప్రదేశ్‌లోని ఓ ఆలయంలోని ట్యాప్ వాటర్ తాగినందుకు ఓ ముస్లిం యువకుడిపై దాడి చేసినట్లు అందులో పేర్కొన్నారు. పోలీసుల రంగ ప్రవేశం అనంతరం వివిధ ఆలయాల పరిసరాల్లో ఏర్పాటు చేసిన బ్యానర్లను తొలగించారు.