సీఎం ఇచ్చిన రూ. 15 కోట్లతో ‘నోముల’ చేస్తున్న పనులు ఇవే..!
దిశ, హాలియా: హాలియా మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. గురువారం నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి హాలియా పురపాలక అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కేటాయించిన రూ. 15 కోట్లతో హాలియా మున్సిపాలిటీలో చేపట్టాల్సిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు (ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మినీ స్టేడియం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్, షాదీఖానా, వైకుంఠధామం, ఆడిటోరియం, బీసీ కమ్యూనిటీ హాల్, డిజిటల్ గ్రంథాలయం, డ్రైనేజ్, సీసీ […]
దిశ, హాలియా: హాలియా మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. గురువారం నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి హాలియా పురపాలక అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కేటాయించిన రూ. 15 కోట్లతో హాలియా మున్సిపాలిటీలో చేపట్టాల్సిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు (ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మినీ స్టేడియం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్, షాదీఖానా, వైకుంఠధామం, ఆడిటోరియం, బీసీ కమ్యూనిటీ హాల్, డిజిటల్ గ్రంథాలయం, డ్రైనేజ్, సీసీ రోడ్ల) ఏర్పాటు కోసం పలు ప్రభుత్వ స్థలలాను పరిశీలించారు. ఈ సందర్భంగా నోముల భగత్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన 15 కోట్ల రూపాయలతో హాలియాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. గత పాలకులు వదిలేసిన దీర్ఘకాలిక సమస్యలకు 36 నెలలోపే పరిష్కరించి చూపిస్తానని చాలెంజ్ చేశారు.