‘రంగనాయక సాగర్ ప్రాజెక్టు సందర్శనకు అనుమతి లేదు’
దిశ, మెదక్: రంగనాయక సాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఉన్నందున, చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు, జిల్లా ప్రజలు ఎవరూ కూడా ఈ కార్యక్రమానికి రావొద్దని సిద్దిపేట కమిషనర్ జోయల్ డేవిస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వ్యాధి వేగంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో దానిని నివారించేందుకు ప్రజలెవరూ బయటకు రాకుండా కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించాయి. దీనికి ప్రజలందరూ సహకరించి ఎవరూ ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండాలని తెలిపారు. లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత మాత్రమే […]
దిశ, మెదక్: రంగనాయక సాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఉన్నందున, చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు, జిల్లా ప్రజలు ఎవరూ కూడా ఈ కార్యక్రమానికి రావొద్దని సిద్దిపేట కమిషనర్ జోయల్ డేవిస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వ్యాధి వేగంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో దానిని నివారించేందుకు ప్రజలెవరూ బయటకు రాకుండా కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించాయి. దీనికి ప్రజలందరూ సహకరించి ఎవరూ ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండాలని తెలిపారు. లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత మాత్రమే ప్రజలు రంగనాయక సాగర్ ప్రాజెక్టు సందర్శించాలని అప్పటివరకూ ప్రజలకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఎవరైనా లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ప్రాజెక్టు సందర్శనకు వస్తే చట్టప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ జోయల్ డేవిస్ హెచ్చరించారు.
Tags : Sri Ranganayaka Sagar project, visit,not allowed, medak, joyal devis