వైన్ షాపుల్లో నో స్టాక్.. మద్యాన్ని మాయం చేశారు..!

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల డిమాండ్‌తో ‘లో కాస్ట్ లిక్కర్‌’కు ఫుల్ డిమాండ్ పెరిగింది. వైన్ షాపుల్లోనే నో స్టాక్ అనేంత‌లా కొరత ఏర్పడింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు..! దీంతో బ్లాక్ మార్కెట్‌ జోరందుకుంది. ముఖ్యంగా రూ. 200 నుంచి రూ. 150 వరకు ఉన్న క్వార్టర్‌‌ను.. ఏకంగా ఫుల్ బాటిల్‌ ధరను నిర్ణయించి అమ్ముతున్నట్టు తెలుస్తోంది. దీనికి మందు ప్రియులు క్యూ కట్టడం గమనార్హం. కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఐదు రోజుల […]

Update: 2021-04-28 08:15 GMT

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల డిమాండ్‌తో ‘లో కాస్ట్ లిక్కర్‌’కు ఫుల్ డిమాండ్ పెరిగింది. వైన్ షాపుల్లోనే నో స్టాక్ అనేంత‌లా కొరత ఏర్పడింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు..! దీంతో బ్లాక్ మార్కెట్‌ జోరందుకుంది. ముఖ్యంగా రూ. 200 నుంచి రూ. 150 వరకు ఉన్న క్వార్టర్‌‌ను.. ఏకంగా ఫుల్ బాటిల్‌ ధరను నిర్ణయించి అమ్ముతున్నట్టు తెలుస్తోంది. దీనికి మందు ప్రియులు క్యూ కట్టడం గమనార్హం. కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఐదు రోజుల క్రితమే పలువురు రాజకీయ నేతల ప్రధాన అనుచరులు భారీగా కొనుగోళ్లు చేసి గమ్యాలకు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఒక్కో డివిజన్ అభ్యర్థి లక్షలు విలువ చేసే మద్యం కొన్నారని.. ఎన్నికల కోసం మద్యం పంపిణీకి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీనికితోడు పలువురు వైన్‌ షాపులు యజమానులు మద్యాన్ని గమ్య స్థానాలకు చేర్చినందుకు అదనంగా కూడా డబ్బులు ఇచ్చారని గ్రేటర్‌ చర్చ నడుస్తుంది.

Tags:    

Similar News