రాష్ట్రాలకు గుడ్‌‌న్యూస్.. ఎయిర్‌ఫోర్స్ విమానాల్లో ఆక్సిజన్ సరఫరా : మోడీ

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసులు తీవ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. ఒక్కరోజు వ్యవధిలోనే మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతుండటంతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ ఆక్సిజన్ కొరతపై అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ఆక్సిజన్ కొరతపై సమావేశంలో చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత ఉండకూడదని మోడీ అధికారులకు స్పష్టం చేశారు. ఆస్పత్రుల్లో మినహా వేరే ఇతర వాటికి […]

Update: 2021-04-22 07:06 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసులు తీవ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. ఒక్కరోజు వ్యవధిలోనే మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతుండటంతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ ఆక్సిజన్ కొరతపై అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ఆక్సిజన్ కొరతపై సమావేశంలో చర్చించారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత ఉండకూడదని మోడీ అధికారులకు స్పష్టం చేశారు. ఆస్పత్రుల్లో మినహా వేరే ఇతర వాటికి ఆక్సిజన్ వాడకూడదని వెల్లడించారు. రాష్ట్రాలో ఆక్సిజన్ అత్యవసరం మేరకు ప్రాణవాయువు ట్యాంకర్లను ఏయిర్ ఫోర్స్ విమానాల్లో తరలించాలని పేర్కొన్నారు.

Tags:    

Similar News