‘బ్యాడ్‌ బ్యాయ్ బిలియనీర్స్’కు బ్రేకిచ్చిన కోర్టు..

దిశ, వెబ్‌డెస్క్ : ‘బ్యాడ్ బాయ్ బిలియనీర్స్’.. అత్యాశ, మోసం, అవినీతి బేస్ చేసుకుని తెరకెక్కిన నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ వెబ్ సిరీస్. ‘విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, సత్యం రామలింగరాజు, సహారా సుబ్రతా రాయ్’ లాంటి వ్యక్తుల జీవితకథల ఆధారంగా రూపొందించిన ఈ వెబ్ సిరీస్ ప్రసారానికి మళ్లీ ఆటంకం ఏర్పడింది. ఈ రోజు నుంచి ప్రారంభం కావాల్సిన సిరీస్ కోసం వెయిట్ చేయాల్సి వస్తోంది. ఇంతకు ముందు, ఈ సిరీస్ తన ప్రతిష్టను దెబ్బతీస్తుందని సుబ్రతా […]

Update: 2020-09-02 01:28 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ‘బ్యాడ్ బాయ్ బిలియనీర్స్’.. అత్యాశ, మోసం, అవినీతి బేస్ చేసుకుని తెరకెక్కిన నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ వెబ్ సిరీస్. ‘విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, సత్యం రామలింగరాజు, సహారా సుబ్రతా రాయ్’ లాంటి వ్యక్తుల జీవితకథల ఆధారంగా రూపొందించిన ఈ వెబ్ సిరీస్ ప్రసారానికి మళ్లీ ఆటంకం ఏర్పడింది. ఈ రోజు నుంచి ప్రారంభం కావాల్సిన సిరీస్ కోసం వెయిట్ చేయాల్సి వస్తోంది.

ఇంతకు ముందు, ఈ సిరీస్ తన ప్రతిష్టను దెబ్బతీస్తుందని సుబ్రతా రాయ్ బీహార్ దిగువ కోర్టును ఆశ్రయించగా.. సిరీస్‌ను తాత్కాలికంగా వాయిదా వేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. మేము దీనిపై అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేసిన కోర్టు.. మరోసారి ఈ విషయం గురించి ఇక్కడకు రాకూడదని స్పష్టం చేసింది. ఏదైనా ఉంటే బీహార్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఉన్నత న్యాయస్థానానికి వెళ్లాలని సూచించింది.

దీంతో, నెట్‌ఫ్లిక్స్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కానీ ఈ పిటిషన్ స్వీకరించని ఉన్నత న్యాయస్థానం.. బీహార్ హైకోర్టుకు వెళ్లే స్వేచ్ఛను ఇచ్చింది. కాగా నెట్‌ఫ్లిక్స్ తరపున సీనియర్ అడ్వకేట్, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించగా.. సుబ్రతా రాయ్ తరపున వికాస్ సింగ్ వాదించారు.

Tags:    

Similar News