ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్లకూ అవే నిబంధనలు : బీసీసీఐ

దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IpL)లో ఆడాలనుకునే ప్రతీ ఒక్క ఆటగాడికి ఒకే రకమైన కోవిడ్-19 నిబంధనలు ఉంటాయని, ఏ ఆటగాడైనా వాటిని పాటించాల్సిందేనని BCCI తేల్చి చెప్పింది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు వన్డే, T20 సిరీస్ ఆడి యూఏఈ (UAE) చేరడానికి ఆలస్యమవుతుండటంతో వారికి నిబంధనల సడలింపు ఇవ్వాలని ఫ్రాంచైజీలు కోరాయి. ఇంగ్లాండ్‌లో బయో సెక్యూర్ స్టేడియంలలో ఆడి వస్తుండటం వల్ల వారిని 7రోజుల క్వారంటైన్ నిబంధన నుంచి తప్పించాలని బీసీసీఐని అడిగాయి. […]

Update: 2020-08-22 05:42 GMT

దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IpL)లో ఆడాలనుకునే ప్రతీ ఒక్క ఆటగాడికి ఒకే రకమైన కోవిడ్-19 నిబంధనలు ఉంటాయని, ఏ ఆటగాడైనా వాటిని పాటించాల్సిందేనని BCCI తేల్చి చెప్పింది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు వన్డే, T20 సిరీస్ ఆడి యూఏఈ (UAE) చేరడానికి ఆలస్యమవుతుండటంతో వారికి నిబంధనల సడలింపు ఇవ్వాలని ఫ్రాంచైజీలు కోరాయి. ఇంగ్లాండ్‌లో బయో సెక్యూర్ స్టేడియంలలో ఆడి వస్తుండటం వల్ల వారిని 7రోజుల క్వారంటైన్ నిబంధన నుంచి తప్పించాలని బీసీసీఐని అడిగాయి. అయితే, ఐపీఎల్ బయోబబుల్‌లో చేరాలంటే ప్రతీఒక్క ఆటగాడు తప్పనిసరిగా క్వారంటైన్ నిబంధనను పాటించాల్సిందేనని బీసీసీఐ సదరు ఫ్రాంచైజీలకు స్పష్టంచేసింది.

‘ఆటగాళ్లకు, ఫ్రాంచైజీలకు వేర్వేరు నిబంధనలు అని మేము నిర్ణయించలేదు. బీసీసీఐ అందరికీ ఒకే రకమైన క్వారంటైన్ నిబంధనలు విధించింది. వాటిని ఆస్ట్రేలియా (Australiya) ఆటగాడైనా ఇండియా (India) ఆటగాడైనా తప్పక పాటించి తీరాల్సిందే. ఒకరి వల్ల మిగతా వాళ్లకు ప్రమాదకం కలిగించలేము’ అని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు ఒకరు స్పష్టం చేశారు. ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా సిరీస్ ఆడుతున్న బెన్ స్టోక్స్, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌తో పాటు మరో 18 మంది టాప్ గ్రేడ్ క్రికెటర్లు ఐపీఎల్ తొలివారం మిస్ అవుతున్నారు. దీంతో ఆయా ఫ్రాంచైజీలు బీసీసీఐని అభ్యర్థించగా, బోర్డు నిర్థ్వందంగా తిరస్కరించింది.

Tags:    

Similar News