మోడీనే ‘మహాత్మ’ అయిపోయాడా.. ‘గాంధీ’కి చోటులేదా.?

దిశ, వెబ్‌డెస్క్ : కరెన్సీ నోటు మీద.. నడి రోడ్డు మీదనో చూస్తున్న బొమ్మ కాదు మహాత్ముడు.. అని ఓ సినిమాలో చెప్పారు. కానీ మన పొలిటీషియన్స్ మాత్రం ఆయనను ఓ బొమ్మలాగానే ట్రీట్ చేస్తున్నారు. ఆయన జయంతిని వాడుకుని.. ఓ ఎక్స్‌‌పో డిజైన్ చేసుకుని.. ఈ విధంగా తమను తాము ప్రమోట్ చేసుకుంటున్నారు. లేదంటే ఉన్నత పదవుల కోసం ప్రధాని మోడీ, కేంద్ర మంత్రుల ఫొటోలు వేసి గాంధీ జయంతిని జరుపుకుంటున్నారు. అంతేకానీ ఆ జయంతి […]

Update: 2021-10-02 02:16 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కరెన్సీ నోటు మీద.. నడి రోడ్డు మీదనో చూస్తున్న బొమ్మ కాదు మహాత్ముడు.. అని ఓ సినిమాలో చెప్పారు. కానీ మన పొలిటీషియన్స్ మాత్రం ఆయనను ఓ బొమ్మలాగానే ట్రీట్ చేస్తున్నారు. ఆయన జయంతిని వాడుకుని.. ఓ ఎక్స్‌‌పో డిజైన్ చేసుకుని.. ఈ విధంగా తమను తాము ప్రమోట్ చేసుకుంటున్నారు. లేదంటే ఉన్నత పదవుల కోసం ప్రధాని మోడీ, కేంద్ర మంత్రుల ఫొటోలు వేసి గాంధీ జయంతిని జరుపుకుంటున్నారు. అంతేకానీ ఆ జయంతి ఎవరిదో వారి ఫొటో మాత్రం కనిపించకపోవడం విడ్డూరం.

ఇందుకు ఉదాహరణగా లెఫ్టినెంట్ గవర్నర్ ప్రఫుల్ కె పటేల్ చేసిన పని.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘ట్రిబ్యూట్ టు ఫాదర్ ఆఫ్ నేషన్’ అని పెద్ద పెద్ద బ్యానర్స్ ఏర్పాటు చేసిన ఎక్స్‌పో డిజైన్‌లో జాతిపిత లేకపోవడం విశేషం. కాగా ప్రముఖ జర్నలిస్ట్ స్వాతి చతుర్వేది ‘మహాత్మాగాంధీ ఎక్కడున్నారు’ అని ప్రశ్నిస్తూ ఇందుకు సంబంధించిన ఫొటోను షేర్ చేయగా.. నెటిజన్లు ప్రఫుల్ కె పటేల్‌పై ఫైర్ అవుతున్నారు. మోడీనే మహాత్మ అయిపోయాడా?.. భారతదేశానికి తల్లి, తండ్రి, దేవుడు కూడా ఆయనేనా అని ప్రశ్నిస్తున్నారు.

 

 

Tags:    

Similar News