ఈ ఏడాది పిల్లలకు నో వ్యాక్సిన్
న్యూఢిల్లీ: పిల్లలకు వ్యాక్సినేషన్ విషయంలో నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనిజేషన్(ఎన్‌టీఏజీఐ) కీలక వ్యాఖ్యలు చేసింది. పిల్లలకు వ్యాక్సిన్ వచ్చే ఏడాదిలో ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. తాజాగా జరిగిన సమావేశంలో పిల్లలకు టీకా, అదనపు డోసు, బూస్టర్ డోసులపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో పిల్లలకు వ్యాక్సిన్ విషయంలో విధివిధానాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని తెలిపింది. త్వరలోనే దీనిపై పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు పేర్కొంది. దీంతో పాటు అదనపు డోసుపై కూడా ఎలాంటి నిర్ణయం […]
న్యూఢిల్లీ: పిల్లలకు వ్యాక్సినేషన్ విషయంలో నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనిజేషన్(ఎన్‌టీఏజీఐ) కీలక వ్యాఖ్యలు చేసింది. పిల్లలకు వ్యాక్సిన్ వచ్చే ఏడాదిలో ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. తాజాగా జరిగిన సమావేశంలో పిల్లలకు టీకా, అదనపు డోసు, బూస్టర్ డోసులపై చర్చ జరిగింది.
ఈ సమావేశంలో పిల్లలకు వ్యాక్సిన్ విషయంలో విధివిధానాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని తెలిపింది. త్వరలోనే దీనిపై పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు పేర్కొంది. దీంతో పాటు అదనపు డోసుపై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది. మరోవైపు బూస్టర్ డోసుపై కూడా ఇంకా శాస్త్రీయ నివేదిక రావాల్సి ఉంది.