‘చందాకొచ్చర్‌పై బలవంతం ఉండదు’
దిశ, వెబ్‌డెస్క్: ఐసీఐసీఐ బ్యాంక్-వీడియోకాన్ గ్రూప్ మనీ లాండరింగ్ కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్‌పై ఎటువంటి బలవంతపు చర్యలను తీసుకోమని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. జస్టిస్ ఎస్ కె కౌల్ నేతృత్వంలోని ధర్మాసన్ ముందు వాదన వినిపించిన ఈడీ సిలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఐసీఐసీఐ బ్యాంక్, వీడియోకాన్ గ్రూప్ లోన్ కేసులో నమోదైనటువంటి ఈసీఐఆర్(ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్)ను అనుసరించేందుకు ఈడీ ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోమని తెలిపారు. […]
దిశ, వెబ్‌డెస్క్: ఐసీఐసీఐ బ్యాంక్-వీడియోకాన్ గ్రూప్ మనీ లాండరింగ్ కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్‌పై ఎటువంటి బలవంతపు చర్యలను తీసుకోమని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. జస్టిస్ ఎస్ కె కౌల్ నేతృత్వంలోని ధర్మాసన్ ముందు వాదన వినిపించిన ఈడీ సిలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఐసీఐసీఐ బ్యాంక్, వీడియోకాన్ గ్రూప్ లోన్ కేసులో నమోదైనటువంటి ఈసీఐఆర్(ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్)ను అనుసరించేందుకు ఈడీ ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోమని తెలిపారు.
ఈ కేసులో ఆమె భర్త దీపక్ కొచ్చర్ అరెస్టును సవాలు చేస్తూ చందా కొచ్చర్ దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు చందా కొచ్చర్ బెయిల్ పిటిషన్‌లను తర్వాత విచారణ జరపనున్నట్టు జస్టిస్ దినేశ్ మహేశ్వరితో కూడిన ధర్మాసనం పేర్కొంది. మనీలాండరింగ్ ఆరోపణలతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇటీవల చందాకొచ్చర్‌తో పాటు ఆమె భర్త, వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ అయిన వేణుగోపాల్‌లపై ఛార్జీషీట్ దాఖలు చేసింది. దీన్ని వారు ముగ్గురూ ఖండించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద చార్జీషీట్‌ను ముంబై ప్రత్యేక కోర్టుకు దాఖలు చేసినట్టు చెప్పారు. రూ. 1,875 కోట్ల రుణాలను వీడియోకాన్ గ్రూపునకు మంజూరు చేయడంలో అవకతవకలు జరిగిన అభియోగంపై కొచ్చర్ దంపతులు సహా వేణుగోపాల్‌పై కేసు నమోదైంది.